Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 6:47 am Posted by : praja deveena

Nalgonda terrible road accident : నల్లగొండ జిల్లాకేంద్రంలో విషాదం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

 

Nalgonda terrible road accident :  ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలో పాన గల్ ఫ్లైఓవర్ పై విషాద సంఘటన చోటుచేసుకుంది. వారాం తపు సెలవు లు ముగించుకుని మళ్ళీ విధుల్లో చేరేందుకు ఉత్సాహంగా బయలు దేరిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రయాణం వి షాదాంతమైంది. తెల్లవారుజామున నల్లగొండ సమీపంలో ని పానగల్ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు ఇలా ఉన్నా యి. పల్నాడు జిల్లా నరసరావుపే టకు చెందిన సా యి సందీప్, హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ లో పని చేస్తున్నాడు. స్వగ్రామంలో సెలవులు గడిపి, తిరిగి వి ధులకు హాజరయ్యేందుకు తన కా రులో హైదరాబాద్ బయలుదేరాడు. తెల్లవారుజామున నిశ్శబ్దంగా ఉన్న నల్ల గొండ పానగల్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే, అక్కడ ఆగి ఉ న్న లారీని సాయి సందీప్ కారు అత్యంత వేగంగా వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

  బలంగా ఢీకొని నుజ్జునుజైన కారు

ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే కారు ముందు భాగం పూ ర్తిగా లారీ వెనుక భాగంలోకి చొచ్చుకుపోయి నుజ్జును జ్జుగా మారింది. సీటు బె ల్టు పెట్టుకుని ఉన్నప్పటికీ, కారు ఇంజిన్ భాగాన్నంతా లోపలికి నలి పేయడంతో సాయి సందీప్ అక్క డి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహం కారులో ఇ రుక్కుపోయిన దృశ్యం అక్కడి వారిని కలచివేసింది.

ఇదిలా ఉండగా సమాచారం అం దుకున్న నల్లగొండ టూటౌ న్ పోలీసులు సీఐ రాఘవులు, ఎస్ఐ సైదులు నేతృత్వంలో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలా నికి చేరుకు న్నారు. తీవ్రకష్టాల నడుమ కారు భాగాలను కట్ చేసి, ఇరు క్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం ని మిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఫ్లైఓవర్‌పై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. అతి వేగం సాయి సందీప్ ప్రాణాలు తీసిందా లేక హైవే పై సరైన సూచిక లు లేకుండా నిర్లక్ష్యంగా నిలిపిన లారీ డ్రై వర్ తప్పిదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కుమారుడి మరణవార్త తెలుసుకు న్న కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారు నల్ల గొండకు చేరుకుంటున్నారు. చిన్న వయసులోనే సాఫ్ట్‌ వేర్ రంగంలో రాణిస్తున్న యువకుడు ఇలా అకాల మరణం చెం దడం స్థానికంగా విషాదాన్ని నింపింది.