Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:56 pm Posted by : praja deveena

Nalgonda tragedy : మాధవరంలో కన్నీటివ్యధ, భార్య మృతి తట్టుకోలేక భర్త హఠాన్మరణo, ఉదయం ఆమె, మధ్యాహ్నం భర్త

Nalgonda tragedy : ప్రజా దీవెన, శాలిగౌరారo: జీవి తాం తం ఒకరికి ఒకరు తోడుగా ని లిచిన దంపతులు చివరికి మ రణంలో కూడా విడిపోకుండా వెళ్లిపోయిన హృదయ విదా రక ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా శాలిగౌరా రం మండలం మాధవరం (కలాన్) గ్రామాని కి చెందిన మామిడి ముత్త మ్మ (73) అనారోగ్యంతో శనివా రం ఉదయం సుమారు 6 గంటలకు కన్నుమూసింది. జీవిత భాగస్వా మి ని కోల్పోయిన ఆ క్షణాన్ని భరించ లేకపోయిన భర్త మామిడి సైదులు (79) తీవ్ర వేదనలో మునిగిపోయా డు.

“ఆమె లేక నేను ఎలా…?” అనే ని శ్శబ్ద ప్రశ్న అతని మనసు ను కలచి వేసింది. భార్య మృతదేహం వద్దే కూర్చొని తట్టుకో లేని దుఃఖంతో ఉండిపోయిన సైదులు కేవలం ఐదు గంటల వ్యవధిలోనే, ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యుడిని పిలిపించగా అ ప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఒకే రోజు లో కొ న్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు దంపతులు ప్రాణాలు విడవ డంతో ఆకుటుంబం మాత్రమే కాదు, మొత్తం గ్రామం శోకసం ద్రంగా మారింది.

ఇంత ప్రేమ, ఇంత అను బంధం అంటూ గ్రామస్థులు కన్నీళ్లు ఆపు కోలేకపోయారు.ఈ దంపతులకు ఏకైక కుమార్తె యాద మ్మ ఉండగా తల్లి దండ్రులిద్దరికీ ఆమెనే తలకొ రివి పెట్టడం కొసమెరుపు. ఒకే చి తిపై కలిసిన ఆ దంపతుల జీవితం గ్రా మ ప్రజల హృదయాల్లో ఎప్ప టికీ మిగిలే జ్ఞాపకంగా మిగిలి పోయింది.