Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda will be modeled: నల్లగొండను మోడల్ గా తీర్చిదిద్దుతా

--ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంతో సొంతింటి కల సాకారం --ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం --యుపిఎస్ సి తరహా విధానాలే టి ఎస్ పి ఎస్ సి లో ఆచరిస్తాం --ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండను మోడల్ గా తీర్చిదిద్దుతా

–ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంతో సొంతింటి కల సాకారం
–ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం
–యుపిఎస్ సి తరహా విధానాలే టి ఎస్ పి ఎస్ సి లో ఆచరిస్తాం
–ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గాన్ని ఆదర్శవంతం గా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆర్ అండ్ బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( R&B Cinema to graphy Minister Komatireddy Venkatareddy)  పేర్కొన్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నల్లగొండ ప్రజ లు నాపై పెద్ద బాధ్యత పెట్టారని, మరింత బాధ్యత పెంచారని గుర్తు చేశారు.

జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనతో (Along with District Collector Dasari Harichandana)  కలిసి ఆయన శివాజీ నగర్ సెంటర్ నుంచి పానగల్ రోడ్డు వరకు 90 లక్షల రూపాయల NCAP నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్జీ కళాశాల నుంచి రామగిరి వరకు కోటి 30 లక్షల రూపాయల నిధులతో విస్తరిస్తున్న బీటీ రోడ్డు పనులకి శంకు స్థాపన చేసారు.

అదేవిదంగా పట్టణంలో నూతనంగా నిర్మించిన కూ రగాయల మార్కెట్ సెంటర్ ని పరిశీలించిన మంత్రి చేపట్టాల్సిన మా ర్పుల గురించి కలెక్టర్ కి పలు సూచనలు చేసారు. తదుపరి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి కార్య క్రమంలో పాల్గొని 244 మంది లబ్దిదారులకి చెక్కులను ( Partici pated in the Kalyan Lakshmi check distribution program and distributed checks to 244 beneficiaries)  అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ ప్రజ లకు ఏ కష్టం వచ్చినా నా ఇంటి గుమ్మం మీకోసం తెరిచే ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో నల్లగొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తా మని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం లో జరిగినట్టు పేపర్ లీక్ లు లేకుండా యూపీఎస్సీ తరహా విధానాలనే టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్ష లన్నిoట్లో ( The TSPSC group exams follow the same pattern as the UPSC)  తూచా తప్పకుండా ఆచరిస్తామని స్పష్టం చేశారు.

నిరుద్యో గులకి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమా లు నిర్వహిస్తామని తెలిపారు. పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ ఫలాల్ని అందిస్తామని చెప్పారు. ఆరో గ్యశ్రీని ఇప్పటికే 10 లక్షల రూపాయలకి పెంచామని, మహిళా సోద రిమనులకి ఇప్పటికె ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించామని గుర్తు చేశారు.

ఆరుగ్యారంటీలను 100 శాతం అమలు చేస్తామని, క్యాబి నెట్ లో నిర్ణ యం తీసుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక స హాయంతో పాటు తులం బంగారం పై నిర్ణయం తీసుకుంటామన్నా రు. అధికారులు పేదల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి అండగా నిల వాలని సూచించారు. నల్గొండలో మంత్రి బిజీ బిజీగా గడిపారు. అంతకు ముందు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఆర్గానిక్ విలేజ్ హోటల్ ని ప్రారంభించారు.

అనం తరం నల్గొండ పట్టణానికి చేరుకున్న మంత్రి పి ఆర్ టి యూ తెలంగా ణ ముద్రించిన టేబుల్ క్యాలండర్ ను ఆవిష్కరించారు. అనంతరం పండ్ల మార్కెట్ వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మార్కెట్ యా ర్డ్ ను సందర్శించి వ్యాపారుల సమస్యలను సావధానంగా విని సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుందామని వ్యాపారు లకి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ తో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాలో పెండింగ్, నడుస్తున్న అభివృద్ధి పనుల గురించి పలు సూచనలు చేసారు.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇంఛార్జి మున్సిపల్ చైర్మన్ ఆబ్బ గోని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ కందు కూరి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఈ ఈ సత్య నారాయణ,అర్.డి. ఓ.రవి, ఎం.అర్. ఓ శ్రీనివాస్, మున్సిపల్ ప్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస రెడ్డి, కౌన్సిలర్ లు యామా కవిత దయాకర్, బోయినపల్లి శ్రీనివాస్, ఖయ్యూం బేగ్, వూట్కూరి వెంకట్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, గోగుల శ్రీనివాస్ యాదవ్, పి ఆర్ టి యు అధ్యక్ష, కార్యదర్శులు వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, కొడారి కృష్ణ, మారెడ్డి వెంకట్ రెడ్డి, జనగాం వెంకన్న గౌడ్, గుండగోని రవిశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.