Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 7:25 am Posted by : praja deveena

Nalgondadistrict Horrific roadaccident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం

 

Nalgondadistrict Horrific roadaccident : ప్రజా దీవె న, పెద్దవూర: ఆ శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ప్రశాం తం గా మొదలైంది.. కానీ ఆ రహ దారిపై మాత్రం కాసేపట్లోనే ఒ క ఘోర విషాదం ముంచుకొచ్చింది. పెద్దవూర మండలం రా మన్నగూ డెం స్టేజి సమీపంలో జరిగిన ఒక భయానక రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను క్షణాల్లో గాల్లో కలిపే సిం ది. రహదారిపై వేగంగా దూసుకొస్తున్న రెండు కార్లు రామన్న గూడెం స్టేజి వద్దకు రాగానే ఊహించని విధంగా ఒకదాని కొకటి బలంగా ఢీకొన్నాయి. ఆ ధాటికి కార్ల ముందుభా గా లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన తీవ్రతకు రెం డు కార్లలో ప్రయాణిస్తున్న వారిలో ము గ్గురు వ్యక్తులు తీవ్ర గా యాలతో అక్కడికక్కడే (స్పాట్ లోనే) ప్రాణాలు కోల్పో యా రు.

     క్షతగాత్రుల ఆర్తనాదాలు

ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శ బ్దం రావడంతో స్థానికులు ఒక్కసా రిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందోనని పరుగున ఘటనా స్థ లానికి చేరుకున్నారు. అప్పటికే అ క్క డ రక్తసిక్తమైన దృశ్యాలు, కార్లలో నలిగిపోయి ప్రాణాల కో సం కొ ట్టుకుంటున్న మరో ముగ్గురి ఆర్తనాదాలు వారిని కల చివేసాయి.స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చా కచక్యంగా వ్యవ హరించడం గమనార్హం. వెంటనే పోలీ సు లకు సమాచారం అందించారు.’108′ అంబులెన్స్‌కు ఫోన్ చేసి రప్పించారు.క్షతగాత్రులను కా ర్ల శిథిలాల నుంచి బయ టకు తీసి, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించా రు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలా నికి చేరు కుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పో స్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు ప్రారంభించారు. అతి వే గమే ఈ ప్రమాదానికి కార ణమా? లేక మరేదైనా సాంకేతిక లోపమా? అనే కోణంలో పోలీసులు ఆరా తీ స్తున్నారు. మృతులు ఎవరు? వారు ఎ క్కడి నుంచి వస్తున్నారు? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.