Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 4:08 pm Posted by : praja deveena

NalgondaPremetricscholarships: బిగ్ బ్రేకింగ్, నల్లగొండజిల్లాలో ఊపందుకున్న ప్రీమెట్రిక్ స్కాలర్షిప్

 

NalgondaPremetricscholarships : ప్రజా దీవెన, నల్ల గొం డ : నల్లగొండ జిల్లాలోని పేద విద్యార్థులు ఉప కార వేతనాలు పొం దేందుకుగాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక దృష్టి కేంద్రీక రిం చారు. జిల్లాలో మండ లా ల వారిగా 13,194 మం ది విద్యార్థు ల కు ఉపకార వేతనాలు అందించా ల్సి ఉండగా, గత వారం వర కు కేవ లం 6 శాతం మాత్రమే ఉన్న ఉపకా ర వేతనాల దరఖాస్తు లు 6 రోజు ల్లో 28 శాతానికి పెరిగాయి. ఇందు కు జిల్లా కలెక్టర్ వారంలో రెండు సార్లు ఉపకార వేతనాలపై విద్యాశాఖ అధి కారు లు, సంక్షేమ అధి కారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిం చి దరఖాస్తు ల అప్ లోడ్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

ప్రత్యేకించి పీఏ పల్లి మండలంలో 90 శాతం దరఖాస్తుల స్వీకర ణను పూర్తి చేసి ముందు వరుసలో నిలి చింది. అనంతరం తిరు మలగిరి సా గర్, ఇతర మండలాలు దరఖాస్తుల స్వీకరణ లో ముం దున్నాయి. ప్రభు త్వ పాఠశాలల్లో పేద వర్గాల నుంచి వచ్చిన విద్యా ర్థులు ఉంటారని, అందువల్ల వారందరూ ఉపకార వేతనాలు పొం దేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి హెడ్మాస్టర్లు విద్యార్థులతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి కులము ధ్రువపత్రాలు ఇతర ధ్రువ పత్రాలతో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయించాల న్నారు.

ఇందుకు గాను విద్యాశాఖ అధి కా రులు బ్యాంకు అధికారులు, రెవె న్యూ,సంక్షేమ అధికారులతో సమ న్వయం చేసుకుని త్వరితగతన ఉ పకార వేతనాలకు దరఖాస్తులు చే సుకునేలా చూడాల్సిన బాధ్య త ఉందని ,సాధ్యమైనంత త్వరగా నూటికి నూరు శాతం ఉపకార వేత నాలు పొందేలా చర్యలు తీసుకో వాలన్నారు. ఇప్పటి వరకు 13194 గాను, 3711 మంది విద్యార్థులు ఉ పకార వేతనాలకు దరఖాస్తు చేసు కున్నారని, తక్కిన వారి చేత దర ఖాస్తులను సమ ర్పించే విధంగా చ ర్యలు చేపట్టాలని ఆమె ప్రకటనలో కోరారు.

ఇందుకు విద్యాశాఖ అధికారులతో పాటు, సంక్షేమ శాఖ అధికారు లు బ్యాంక్ అధికారులు సహకరించాల ని, తహసిల్దారులు సైతం విద్యార్థు లకు అవసరమైన కుల ధ్రువపత్రాల ను జాప్యం లేకుండా జారీ చేయాల ని చెప్పారు.