Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NalgondaSuicide : కన్నతల్లి కర్కశత్వం, కొండమల్లేపల్లిలో పిల్లలను చంపి తానూ ఆత్మ హత్య

కన్నతల్లి కర్కశత్వం, కొండమల్లేపల్లిలో పిల్లలను చంపి తానూ ఆత్మ హత్య

NalgondaSuicide : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో (kondamallep alli) కన్నతల్లి కర్కశత్వం వెలుగు చూసింది. దీపావళి పండుగ సందర్భంగా సోమవారం చో టుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివ రాల్లోకి వెళ్తే కొండమల్లేపల్లిలో ఘోర దుర్ఘ టనతో స్థానికంగా విషా ద ఛాయలు అలుముకున్నాయి. ఇ ద్దరు చిన్నారుల ఊపిరితీసిన తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడిం ది. వీరంతా బతుకుతెరువు కోసం వల స వచ్చిన ఒక కుటుంబ సభ్యులు గా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల (Bapatla) జిల్లా జ నకాల గ్రామానికి చెందిన కుం చాల రమేష్, భార్య నాగలక్ష్మి (27), పిల్ల లు మోహన్ సాయి (0 9), అవంతిక (7)లతో కలిసి సుమారు నాలుగు సంవ త్సరాల క్రితం ఉపాధి కోసం కొండమల్లేపల్లికి వలస వచ్చారు. అయి తే భర్త రమేష్ మద్యపానానికి బానిస కావడం వల్ల కొంతకాలంగా వారి దాంపత్య జీవితంలో కలహా లు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలి పారు.

ఈ గొడవలు తరచుగా జరిగేవి కావడంతో ఆ ఇంట్లో ప్రశాంతత కరు వైంది.​ఆదివారం రాత్రి కూడా భా ర్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త కుంచాల రమేష్ కోపంతో ఇంటి నుంచి బ యటకు వెళ్లిపోవడమే కాక తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసు కు న్నాడు. భర్త తీరు తాగుడుతో నిత్యం ఎదురవుతున్న కష్టాలు భవి ష్యత్తు పై ఏర్పడిన అభద్రతాభావం చివర కు నాగలక్ష్మి తీవ్ర మన స్తాపానికి దారి తీసింది. ​ఆ క్షణంలో ఏం చేయాలో పాలు పోక ఆ త ల్లి క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది.

అనుకున్న విధంగా ముందుగా తన ఇద్దరు రెండు కళ్ల లాంటి పిల్ల లు మోహన్ సాయి, అవంతికలను చం పేసింది. ఆ తర్వాత తాను కూడా ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. సోమవా రం ఉద యం ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థాని కులు పోలీసులకు సమాచారం అందించారు.​సమాచా రం అందుకున్న కొండమల్లేపల్లి పోలీసులు వెంటనే సంఘటన స్థలా నికి చేరుకున్నారు. వారు తలుపులు పగలగొట్టి చూడ గా నాగలక్ష్మి ఆమె ఇద్దరు పిల్లలు వి గతజీవులై పడి ఉన్నారు. ఈ దృశ్యం చూసి న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.

పోలీసులు మృతదే హాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం ని మిత్తం దేవరకొండ ప్రభు త్వ ఏరియా ఆసుపత్రికి తరలించా రు. కుటుంబ కలహాలు ఆర్థిక ఇ బ్బందుల వల్లనే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమి కంగా భావిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.​మద్యానికి బా నిసైన ఒక వ్యక్తి నిర్లక్ష్యం కుటుం బంలో నెలకొన్న నిత్య కలహా లు చివరికి రెం డు పసిప్రాణాలతో సహా ఒక కుటుంబాన్నే బలితీసు కోవడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది.