Nallamadu Double Murder Mystery : ప్రజా దీవెన, ఏలూరు: పచ్చని ప్ర కృతి, ప్రశాంతమైన వాతావరణం.. కానీ ఆ తోటలోకి అడుగుపెట్టిన స్థానికులకు ఊహించని షాక్ త గిలింది. ఏలూరు జిల్లా నల్లమడు గ్రా మ శివార్లలోని ఒక జీ డిమామిడి తోట ఇప్పుడు ఒక నెత్తుటి క్రైమ్ సీన్‌గా మారి పోయింది. అక్కడ అ నుమానాస్పద స్థితిలో పడి ఉన్న రెం డు మృతదేహాలు గ్రామాన్ని ఒ క్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేశారు. తీరా పరిశీలించి చూస్తే ఆ మృ తదేహాలు స్థానిక త ల్లి, కూతుళ్లవని తేలింది. తల్లి వడ్డే వెంకటలక్ష్మీ, కూతురు వ రలక్ష్మీ ఇద్దరూ అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయిపడి ఉ న్నారు.ఇదిలా ఉండగా ఇది సాధారణ మరణం కాదు ఒక పక్కా ప్లా న్ ప్రకారం జరిగిన ఘాతుకంగా పోలీసులు అను మానిస్తున్నారు.
ఈ దారుణ ఘటనలో మృతదేహా లపై తీవ్రమైన గాయాలు ఉండగా ఘటనా స్థలంలో ఉన్న ఆనవాళ్లు వారు ప్రాణాల కోసం ఎంతలా పో రాడారో చెబుతున్నాయి. నిర్జన ప్ర దేశ మైన జీడి తోటను నిందితులు సేఫ్ జోన్‌గా ఎంచుకున్నట్లు కనిపి స్తోందని పోలీసులు భావిస్తున్నా రు. స్థానికుల సమా చారంతో రం గంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధా రాలు సేకరిస్తున్నారు. అసలు వారిని అక్కడికి రప్పించి హ త్య చేశారా? లేక మరెక్కడైనా హత్య చేసి ఇక్కడ పడేశా రా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఆ తల్లీకూతుళ్లకు ఎవరితోనైనా గొడ వలు ఉన్నాయా? పాత కక్షలేమైనా కార ణమా? అనే ప్రశ్నలకు సమా ధానం దొరకాల్సి ఉంది.
ఈ జంట హత్యలు నల్లమడు గ్రా మంలో పెను సంచలనం గా మారా యి. నిందితులను పట్టుకునేందు కు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ మేరకు పోలీ సులు కేసునమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు. అయి తే తల్లి కూతురుల దారుణ హత్యలో పోలీసులు లోతైన వి చారణ చేప ట్టి నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
