Praja Deveena
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 2:05 am Posted by : praja deveena

National Banks Strike postponed : బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు, ఉద్యోగుల సమ్మె వాయిదాతో నేటినుంచి యథావిధిగా సేవలు

 

National Banks Strike postponed : ప్రజా దీవెన, దిల్లీ: దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త అందింది. బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన మూడు రోజుల స మ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంకుల అసోసియే షన్ (ఐబీఏ), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూ ఎఫ్‌బీయూ) మధ్య ఆది వారం రాత్రి జరిగిన చర్చలు సఫ ల మయ్యాయి.

దీంతో సోమవా రం నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేయ నున్నాయి. సమ్మె ను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. కుదిరిన ఒప్పందంలో భాగం గా బ్యాంకుల్లోఐదు రోజుల పనిదినాల అంశంపై రెండు వర్గాలతో కూడిన అత్యు న్నత స్థాయి కమి టీని ఏర్పాటు చేయను న్నారు. ఈ క మిటీ ఉద్యోగులు, వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయoపై చర్చించనుంది.

అధికారుల పీఎస్ఐ పథకంలో మార్పులపై చర్చలు

స్కేల్-4, ఆపై స్థాయి అధికారుల కు సంబంధించిన పీఎస్ఐ పథ కంలో మార్పులపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వా నికి పంపేందుకు ఐబీఏతో చర్చలు జరగ నున్నాయి. మిగిలిన సమస్యల పరిష్కారంపైనా సాధ్యమైనంత త్వరగా చర్చలు ని ర్వహించాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.సమ్మె వాయిదాతో బ్యాంకు సేవ లకు అంతరాయం తప్పింది. ఐదు రోజుల పని దినాలపై ఏర్పా టు కానున్న కమిటీ నిర్ణయాలు, తదుపరి చ ర్చలపై బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారుల్లో ఆసక్తి నెలకొంది.