బీసీరిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగ సవరణనే ఏకైక పరిష్కారం
పరిమితిని ఎత్తివేసే వరకు దేశ వ్యాప్తంగా పోరాడుతాo --ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తరహా లోనే బీసీ రక్షణ చట్టo చేయాలి --బీసీ రిజర్వేషన్ల పెంచి ప్రధాని మో దీ బీసీల రుణం తీర్చుకోవాలి -- తెలుగు రాష్ట్రాల సీఎంలు అఖిల పక్షాలతో ఢిల్లీకి రావాలి --బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీ లో చంద్రబాబు చక్రం తిప్పాలి -త్వరలోనే విజయవాడలో బీసీల మేధోమదన సమావేశo --మీడియా సమావేశంలో బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్ రావు లు

NDA BCReservations: ప్రజా దీవెన, విజయవాడ: దేశం లో బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేష న్ పై విధించిన 50 శాతం పరిమితి ని ఎత్తివేసి జనాభా దామాషా ప్రకా రం బీసీ లకు రిజర్వేషన్లు కల్పించా లంటే రాజ్యాంగ సవరణ ఒకటే ఏకై క పరిష్కార మార్గమని, రాజ్యాంగ సవరణ కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ప్ర త్యేక చొరవ తీసుకోవాలని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌ డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసనశంకర్రావులు ఇరువు రు సీఎంలకు విజ్ఞప్తి చే శారు. బుధవారం విజయవాడ పట్ట ణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బిసి ఉ ద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం వి ఎస్ ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగి న మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలోని 11 రా ష్ట్రాలలో తమ జనాభాకు అనుగుణంగా రిజ ర్వేషన్లు పెం చాలని కేంద్ర ప్రభు త్వా నికి డిమాండ్ చేస్తున్నారని అయిన ప్పటికీ గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వలన రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదని తీర్పు ఇ చ్చిన దరిమిలా బీసీ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాల చేతుల్లో లే కుండా పోయిందని వారు తెలిపారు. దేశంలో ఎస్సీ ఎస్టీలకు అలాగే చివరికి అగ్ర కులాలకు కూడా జనాభా దామషా ప్రకా రం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని బీసీలకు మాత్రమే జనాభా ఉండి కూడా రి జర్వేషన్లు కల్పించకుండా అత్యల్ప శాతం క ల్పిస్తూ బీసీలకు తీరని అ న్యాయం చేస్తున్నారని వారు ఆ రోపించారు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూ ఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం కల్పించినప్పుడు దేశంలో మొ త్తం రిజర్వేషన్లు 60 శా తం అమలు జరుగుతున్న ఇవేమీ పట్టించుకోకుండా బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు మాత్రమే 50 శాతం పరిమితి అంటూ గగ్గోలు పెడుతు బీసీలను రాజ కీయంగా అణిచివే యాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో సమగ్ర కులగనన జ రిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన నేటి వరకు అమలు జరగ డం లేదని, అదే విధంగా ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చే పట్టి బీసీల జనాభా లెక్కలు తేల్చా లని ఎందుకోసం తక్షణ మే డెడికేష న్ కమిషన్ ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వ హించాలని వారు డి మాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమ లు చేసి న తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిం చా లని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల పైన భౌతిక దాడులు, సామా జిక బహిష్కరణలు, కులం పేరుతో దూషణ లు జరగకుండా సామాజిక రక్షణ కల్పించడానికి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకు రావాలని ప్రయత్నించడం చాలా అభినందనీయమని ఇదే సమయంలో భవిష్యత్తులో కోర్టుల లో ఈ చట్టం వీగిపోకుం డా ఉండడానికి సమగ్రమైన చట్టాన్ని రూపొందించి న్యాయ వివాదాలకు తావు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. అ లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరహాలోనే బీసీ రక్షణ చట్టాన్ని తీ సుకురావాలని డి మాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసే ప్రయ త్నం చేస్తామని ఇదే సమయంలో ఏపీ తెలం గా ణ సీఎంలు ఇరువురు అ ఖిలపక్షం తో ఢిల్లీకి వెళ్లి భారత ప్ర ధాని నరేంద్ర మోడీతో భేటీ నిర్వ హించాలని ప్రత్యేకంగా ఎ న్డీఏ కూట మిలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయు డు ప్రత్యేక చొరవ తీసు కొని బీసీ రిజర్వేషన్లు పెంపు కోసం ఢిల్లీలో చక్రం తిప్పాలని వారు కోరా రు. బీసీ రిజర్వేషన్ల పెం పు, బీసీ రక్ష ణ చట్టంపై సంక్రాంతి పండుగ తర్వాత విజయ వాడలో బీసీల మే ధోమదన సమావేశo నిర్వహించి భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని, బీసీ రిజర్వేషన్లు పెంచే వ రకు దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాజు ల శ్రీనివాస్ గౌడ్, కేసిన శంకర్రావులు వెల్లడించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి అన్నవరపు నాగ మల్లేశ్వరరావు, బీసీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్వి రావు, ప్రధాన కార్యదర్శినమ్మి అప్పా రావు, బీసీ ఉద్యోగుల సం ఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షు లు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, సుబ్బరావు, బాదన్న బాబయ్య, రాంబాబు, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.




