NDA minister BandiSanjayKumar : కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు, విద్యాకమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయండి
విద్యారంగ అభ్యున్నతి కోసం సి ఫారసు లేకపోగా టీచర్ల జీతాలను తగ్గించాలనడం సిగ్గుచేటు --అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వి ద్యావేత్తలు లేని విద్యాకమిషన్ -- చాక్ పీసులకు పైసల్లేక, స్కావెం జర్లు లేక అల్లాడుతుంటే పరిష్కా రాలేవి --కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుండి 45కు పెంచడం దుర్మార్గం --పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం --విద్యావేత్తలు, ఉపాధ్యాయ సం ఘాలు, తల్లిదండ్రుల ప్రమేయం లే ని ఏకపక్ష నివేదిక --ఏదైనా కూల్చివేతల్లో సీఎం రే వం త్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయo --అర్బన్ నక్సలైట్లను కమిటీల్లో వే స్తారు, లొంగిపోయిన మాజీలను ప్రోత్సహిస్తున్నారు -- మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ కుమార్ ఫైర్

NDA minister BandiSanjayKumar : ప్రజా దీవెన, హై దరాబాద్: విద్యా రంగ అభివ్రుద్ధి కోసం అవసరమైన సిఫార సులు చేయకుండా ఉపా ధ్యాయుల జీతాలు తగ్గించాలం టూ విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డా రు. ‘‘విద్యా కమి షన్ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేద ని, ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూ ర్చుని రూపొందించిన నివేదికని, దాన్ని రిపోర్టును చెత్తబు ట్టలో వేయండoటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీ వ్ర స్థాయిలో మండిపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా చెత్తబుట్ట కూడా అవమాన కరంగా భావించే నివేదిక ఇదని, ఆనివేదికను తీసుకెళ్లి మూ సీలో విసిరేయండన్నారు.
ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసి అవ మానిం చే లా నివేదిక ఇచ్చిందన్నారు.ఉత్తీర్ణత మార్కులను 35 నుం డి 45కు పెంచాలని చేసిన సిఫారసులను అమలు చేస్తే పేద విద్యార్థు లు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశా రు. ఆయా విద్యార్థ లంతా ఇకపై స్కూల్ స్థాయిలోనే ఫె యి లై ఉన్నత విద్యకు దూర మవుతారని ఆవేదన వ్యక్తం చేశా రు.
శనివారం హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర అ ధ్యక్షులు బసవ లక్ష్మీ నారాయణ, మధు సూదన్ రెడ్డి, రాష్ట్ర నాయ కులు కొప్పు భాష తదితరులతో క లిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సం జయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తి గా భ్రష్టు పట్టింది. విద్యా శాఖకు గత రెండేళ్ల నుండి మంత్రి లేరు. గత ప్రభుత్వంలో నూ విద్యాశాఖలో స్కావెంజర్లు లేరు. పేద విద్యార్థుల ఆశ లు కలగానే మిగిలిపోతున్నా య్. స్కూళ్లు ఉన్న చోట టీచ ర్లు లేరు. టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరు. అందరూ ఉ న్న చోట కనీస సదుపాయాలు లేవు. డ్రాపవుట్స్ సంఖ్య పె రుగుతోంది. విద్యార్థులకు ప్రోత్సాహకం లేదు. ప్రైవేటు పాఠ శాలల్లో చదువుదామంటే ఫీజులు భరించలేని పరిస్థితి. ఫీ జు రీయం బర్స్ మెంట్ బకాయిలు ఇవ్వలేని దుస్థితి. ఉద్యో గులకు డీఏలు ఇవ్వ రు. బకాయిలు ఇవ్వరు. రిటైర్డ్ ఉపా ధ్యాయులకు రిటైర్డ్ మెంట్ బెన్ ఫిట్స్ ఇవ్వరు.
విద్యారంగం ఇన్ని సమస్యలతో కు నారిల్లుతుంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపర్చాలనే సోయి లేకుండా విద్యా కమిషన్ పూర్తి భి న్నంగా నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు విద్యారంగంపై అవగాహనే లేదు. వి ద్యా కమిషన్ లో విద్యావేత్తలు లేరు. విద్యా రంగ నిపుణు లు లేరు. కనీసం విద్యా ర్థు లు, టీచర్లు, తల్లిదండ్రులతో, వి ద్యా వేత్తలతో కూడా మాట్లాడిన దాఖలాల్లేవు. ఇవేమీ చే యకుండా ప్రభుత్వానికి ఆర్ధిక భారం అవు తుందనే సాకు తో టీచర్ల జీతాల్లో కోత పెట్టాలని చెప్పడం విడ్డూరం.
ప్రపంచంలో ఆదర్శవంతమైన వి ద్యను అందిస్తున్న దేశం ఫి న్ ల్యాండ్. ఆ దేశంలో ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు మా త్రమే అత్యధిక జీ తాలు అందిస్తున్నారు. అందుకే వి ద్యలో ప్రపంచంలోనే అన్ని దేశా ల కు ఆదర్శంగా నిలుస్తోంది. ఇ క్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెప్పడమేంటి? జీతాలు తగ్గిస్తే విద్యా రంగ వ్య వస్థ బాగుపడుతుందా? దేని ప్రకారం జీతాలు తగ్గించా లని సిఫారసు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాళ్లంతా పేద పిల్లలే. అ ట్లాంటి పిల్లలు 35 మార్కులొస్తే పాస్ అయ్యే అవకాశ ముం ది. కానీ ఆకునూరి మురళీ కమిషన్ మా త్రం 35 నుండి 45 మార్కులకు పెంచడం దుర్మార్గం. దీని వ ల్ల పేద పిల్లలంతా ఇక ఉన్న త విద్యకు వెళ్లలేరు. స్కూల్ స్థాయికే పరిమితమై ఆగిపోతారు.విద్యా రంగానికి ఏళ్ల తరబడి సేవ లందిస్తున్న ఉపాధ్యాయులకు సీని యారిటీ ఆధారంగా హెడ్మాస్టర్ గా ప్రమోషన్ ఇస్తున్నారు.
కమిషన్ మాత్రం అందుకు భిన్నంగా నేరుగా హెడ్మాస్టర్ పో స్టుకు పరీక్షలు నిర్వ హించాలని చెప్పడం విడ్డూరం. ఆ కు నూరు మురళి అర్బన్ నక్సలైట్ భావజాలం. ఆయన ఆధ్వ ర్యంలో కమిషన్ వేయడాన్ని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చే స్తోంది. అర్బన్ నక్స లైట్ ఆధ్వర్యంలోని కమిషన్ ద్వారా ని వేదిక తెప్పించుకుని ప్రభు త్వం ఏం సాధించింది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అ వలంబిస్తున్నారు. లొంగి పోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహి స్తున్నా రు. మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారు.
విద్యా రంగం అభ్యున్నతి కోసం సి ఫారసులు చేయకుండా ఉపా ధ్యా యుల జీతాలను తగ్గించాలని చెబుతున్న విద్యా కమిషన్ రిపోర్టు ను చెత్తబుట్టలో వేయండి.లేకపోతే మూ సీలో పడేయండి. రిపోర్ట్ ఇచ్చి న వ్యక్తులకే నైతికత లేదు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదిక అది. ఉపాధ్యాయులంతా మనో భా వాలను దెబ్బతీసి అవమా నించడమే అవుతుంది. టీచర్ల లంతా ఏకమవ్వాలి. ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ అండగా ఉంటుంది.తెలంగాణ రైతాంగానికి వెంటనే రైతు భరోసా ఇ వ్వాలని పేర్కొంటూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్యా చర ణ చేపట్టబోతోంది.
సంక్రాంతి పండగ అయిన వెంటనే రైతు భరో సా నిధులను జమ చే స్తామని ఒక సారి మున్సిపల్ ఎ న్నికలైపోగానే రైతు భరోసా నిధు లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫి బ్రవరి 4న మరో సారి హామీ లి చ్చారు. కానీ ఇంతవరకు ఆహామీని అమలు చేసిన దా ఖ లాల్లేవు. ఇప్పటి వరకు రైతు భరోసా రెండు వాయి దాల పై సలు రైతులకు బాకీ ఉ న్నారు. మూడో వాయిదా వచ్చే స మయానికి రైతు భరోసా పైసలిచ్చి. మిగిలిన రెండు వాయి దాలను ఎ గ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నరు.
ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల య్యా క రైతు భరోసా పైసల ను ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టాలని చూస్తున్నారు. తక్షణ మే రైతు భరోసా సొమ్మను రైతు ల ఖాతాల్లో జమ చే యా లి. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆదే శాల మేరకు కిసాన్ మోర్చా ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చే స్తారు.కాంగ్రెస్ ది కూల్చివేతల ప్ర భుత్వం. ఇం డ్లు కూలుస్తున్నారు. గుడులను కూలుస్తున్నారు. ఇట్లనే ఉం టే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారు.
నరేంద్రమోదీ ప్రభు త్వం 4 కోట్ల ఇండ్లను కట్టించి పేద లకు ఇండ్లు నిర్మించడంలో ముం దుంటే.. కాంగ్రెస్ కూల్చివేతల్లో ముందుంది ఉంది. కూల్చివేతల్లో దేశంలోనే రేవంత్ ప్రభు త్వం ముం దుంది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ వాళ్లకు దర ఖాస్తు చేసుకుంటే కూల్చివేతల్లో గిన్నిస్ రికార్డ్ రేవంత్ రె డ్డి కే దక్కుతుంది. కోకోపేటలో వక్ఫ్ బోర్డు భూముల జోలికి వెళ్లరు.మైనింగ్ భూముల జోలికి వెళ్లరు.
కానీ అధ్యాత్మి క మైన శారదా పీఠం లోని గుడులను కూలు స్తున్నరు. పే దల ఇండ్లను కూలుస్తుంటే ప్రతి ఒక్కరూ అ య్యో పాపం అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సైకో మా దిరిగా ఆనందం పొందుతున్నారు. అసలు పేదల ఇండ్లు కూ ల్చడానికి మీకు మనసెలా వచ్చింది? ఒకనా డు రేవంత్ రెడ్డే పేదల ఇండ్లను ఎ ట్లా కూలుస్తారని ప్రశ్నించారు కదా? ఇప్ప టికైనా సీఎం తన రాక్షసానంద విధానాన్ని మార్చుకోవాలని బం డి సంజయ్ హితవు పలికారు.




