Neet UG exam new date announced : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశ వ్యా ప్తంగా వైద్య విద్యార్థుల నిరీక్షణకు తెర పడింది. దేశవ్యాప్తంగా లక్షలా ది మంది కలలుకనే నీట్ (NE ET) (UG) 2026 పరీక్షా సమరానికి ముహూర్తం ఖరారైంది. మీ ప్రిపరేషన్‌కు పదును పెట్టాల్సిన సమయం వచ్చేసింది. భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NT A)పరీక్షా నిర్వహణ తేదీని అధికారికంగా ప్రకటించింది. జూ న్ 21 ఆదివారం తదుపరి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణ యించింది.
పరీక్షల సమయంలో సోషల్ మీడి యాలో వచ్చే గందరగోళ వార్తలను నమ్మకండి. అధికారిక సమాచారం కోసం ఈ క్రింది వాటిని మాత్రమే అనుసరించండని నీట్ అధికారులు తెలి పారు. అభ్యర్థులు మరి యు తల్లిదండ్రులు కేవలం ఎన్ టి ఎ(NTA) అధికారిక వెబ్‌సైట్ మరి యు అధికారిక మాధ్య మాల ద్వా రా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.
ఇక మిగిలింది తక్కువ సమయం ఉన్నందున జూన్ 21న జరిగే ఈ పరీక్షలో విజయం సాధించడానికి మీ రివిజన్ ప్లాన్ ను ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని, ఆల్ ది బెస్ట్ అంటూ ఎన్ టిఎ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
