Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 10:37 am Posted by : praja deveena

Neet2.0 Bihar scam Spill the beans : నీట్ రీ-ఎగ్జామ్ 2.0, బయోమెట్రిక్‌కే కన్నం, బీహార్‌లో మరో ‘రూ.10లక్షల’ నకిలీ ముఠాగుట్టురట్టు

 

Neet2.0 Bihar scam Spill the beans : ప్రజా దీవెన, పాట్నా: ఆ హైటెక్ సె క్యూరిటీని చూసి అంతా అభేద్యం అ నుకున్నారు. కానీ, ‘స్కామర్ల’ ప్లాన్ ముందు ఆసిస్టమ్ కూడా తలవంచక తప్పలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న NEET వివాదం తర్వాత పకడ్బందీగా నిర్వ హిస్తున్నా మన్న భ్రమలను పటా పంచలు చేస్తూ, NEET రీ-ఎగ్జామ్‌ లో మరో భారీస్కాం వెలుగుచూసింది. అసలు విద్యార్థుల ను పక్కన బెట్టి, తెరవెనుక ‘నకిలీ అభ్యర్థుల’తో (సారో గేట్ క్యాండిడేట్స్) పరీక్ష రాయించేందుకు జరిగిన ఒక హై-ప్రొ ఫై ల్ డీల్‌ను బీహార్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఏకంగా 30 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఒక్కో సీటుకు రూ. 10 లక్షలు

మెరిట్ లేకపోయినా డాక్టర్ సీటు సాధించాలనే కొందరు అ భ్యర్థుల బలహీనతను ఈ ముఠా క్యాష్ చేసుకుంది. నమ్మ శక్యం కాని రీతిలో సాగిన ఈ స్కాం వివరాలు ఇలా ఉన్నా యి. అసలు విద్యార్థులకు బదులుగా పరీక్షల్లో తోపులైన ‘న కిలీ అభ్యర్థులను’ ఎగ్జామ్ హాల్‌లోకి పంపేలా ప్లాన్ చేశారు. ఈ లీక్ అండ్ రీ-రైట్ కాంట్రాక్ట్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథ మి క విచారణలో తేలింది.

ఇన్‌సైడర్ కొల్యూజన్ సిబ్బందితో కుమ్మక్కు

ఆధునిక పరీక్షల్లో బయోమెట్రిక్ వె రిఫికేషన్ అతిపెద్ద అడ్డం కి. కానీ, ఈ ముఠా దానికి కూడా చెక్ పెట్టింది. పరీక్షా కేంద్రం లోని కొందరు లోక ల్ సిబ్బందిని భారీ డబ్బుతో లోబ రు చు కుని, బయోమెట్రిక్ తనిఖీల దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుం డా ‘గ్రీన్ సిగ్నల్’ మేనేజ్ చేశారు.సరిగ్గా పరీక్ష ప్రారంభమ య్యే సమయానికి పక్కా సమాచారంతో బీహార్ పోలీసులు రంగంలోకి నెట్‌వర్క్‌ ను గురిచూసి కొట్టారు.

సిబ్బందితో సహా ముఠాగుట్టు రట్ట వడంతో ఈ స్కామ్ నె ట్‌వర్క్ ఎంతవరకు పా కిందనే దానిపై ఇప్పు డు విచారణ ముమ్మరం చేశారు. టెక్నాలజీ ఎంత అప్‌గ్రేడ్ అవుతున్నా.. లూప్‌హోల్స్ వెతకడంలో స్కామర్లు ఒక అడుగు ముందే ఉంటున్నారనడానికి ఈ NEET రీ-ఎగ్జామ్ ఘటనే నిదర్శ నం. మరి ఈ వ్యవహారంలో వెనుక ఉన్న అసలు ‘బిగ్ బా స్‌ లు’ ఎవరో తెలియాల్సి ఉంది.