IndiaOpinionPoliticsక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

New Delhi Massive short circuit : బిగ్ బ్రేకింగ్, న్యూఢిల్లీలో ఘోర వి ద్యుద్ఘాతo, అర్ధరాత్రి ‘నిప్పుల’ నర కంలో తొమ్మిదిమంది బలి

New Delhi Massive short circuit : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీ లో ఆదివారం తెల్లవారు జామున ఒక భయంకరమైన విషా ద ఘటన సంభవించింది. నిద్రలో ఉన్న కుటుంబాలను మృ త్యువు అగ్నిరూపంలో కబళించిం ది. షాదార్‌లోని వివేక్‌ విహార్‌ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమా దం ఇప్పుడు యావత్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో ఇప్పటికే తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యా రు.

సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఒక సాధారణ ఏసీ (AC) యూనిట్ పేలడమే ఈ పెను ప్రమాదానికి కార ణ మని ప్రాథమిక విచా రణలో తేలింది. ఆదివారం తెల్ల వారు జామున అందరూ గాఢ ని ద్ర లో ఉన్న వేళ ఏసీ కంప్రెసర్ పే లడంతో ఒక్కసారిగా మంటలు చెల రేగి, నిమిషాల వ్య వధి లోనే భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దట్టమైన పొగ, సె గలు కమ్ముకోవడంతో లోపల ఉన్నవారికి బయట పడే మా ర్గం కనిపించలేదు.

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈ అగ్నిప్ర మాద తీవ్రత తారాస్థాయిలో ఉండగా తొమ్మిది మంది దు ర్మరణం పాలవగా నలు గురు తీవ్రగాయాల పాలవగా పది మంది సురక్షితంగా బయటపడ్డారు. భవనంలో మంటలు వ్యాపించి న తీరు చూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. రంగంలోకి ‘ఫైర్ ఫైటర్స్’ ప్ర మాద సమాచారం అందిన వెంటనే దిల్లీ అగ్నిమాపకదళం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది.


ప్రమాద తర్వాత 14 అగ్నిమాపక యంత్రాలు నిరంతరా యంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. రె స్క్యూ సిబ్బంది ప్రాణా లకు తెగించి భవనంలోకి ప్రవేశించి 10 మందిని ప్రాణాలతో బయటకు తీసుకువచ్చారు. వేసవి తాపం పె రగడంతో ఏసీల వాడకం విపరీతం గా పెరిగింది. కానీ, ఒక చిన్న మెకా నికల్ లోపం తొమ్మిది మంది ప్రా ణాల ను బలి తీసుకోవడం గమ నార్హం. పాతబడిన వైరింగ్, నా ణ్యత లేని ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల మనం ఎంత జాగ్రత్త గా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button