Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

New model cars : అందుబాటు ధరల్లో అత్యాధునిక కార్లు

--రూ.20 లక్షల్లోనే అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ తో  వచ్చేవి ఇవే --కార్ల ప్రియులకు కావాల్సినన్ని అత్యాధునిక మోడల్స్

అందుబాటు ధరల్లో అత్యాధునిక కార్లు

–రూ.20 లక్షల్లోనే అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ తో  వచ్చేవి ఇవే
–కార్ల ప్రియులకు కావాల్సినన్ని అత్యాధునిక మోడల్స్

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త కొత్త మోడల్స్ కార్లు అందుబాటు ధరల్లో లభ్యమవుతు న్నాయి. భారతీయ మార్కెట్లో అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) గల కారు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి పలు రకాల కార్లు అందుబాటు లోకి వచ్చాయి. కొత్త మోడల్స్ కార్లు ఎంచు కోవడానికి అనేక ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయని మార్కెట్ వర్గా లు తెలిపాయి. ADAS అనేది బ్రేకింగ్, స్టీరింగ్, పార్కింగ్, లేన్ కీపిం గ్ వంటి వివిధ పనులలో డ్రైవర్లకు సహాయపడే సిస్టమ్. ADAS డ్రైవర్లు, ప్రయాణీకులకు భద్రత, సౌకర్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS)ని అందించే రూ. 20 లక్షల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన కొన్ని కార్లు బాగా పాపులర్ అయ్యాయి కూడా అవేమిటో పరిశీలిద్దాం.
*హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్:*
2023 మార్చిలో విడుదలైన హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అనేది హోండా సిటీ సెడాన్‌కు కొత్త వెర్షన్. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లు ఉన్నాయి. మీరు V వేరియంట్, అంతకంటే ఎక్కువ ధరలో ADASని పొందవచ్చు, దీని ధర రూ. 11.71 లక్షల నుంచి రూ. 16.19 లక్షల రూపాయల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్).
*హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్:*
ఇది 2023లో విడుదలైన సెడాన్ మరొక కొత్త వెర్షన్. ఇది ఫార్వర్డ్ కొలిషన్ మిటిగేషన్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ADAS ఫీచర్లను కూడా కలిగి ఉంది. ADASని SX (O) CVT, SX (O) టర్బో వేరియంట్లలో పొందవచ్చు, దీని ధర రూ. 10.96 లక్షల నుంచి రూ.  17.38 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్).
*హోండా ఎలివేట్:* పాపులర్ కాంపాక్ట్ SUV హోండా ఎలివేట్ కారు లేన్ డిపార్చర్ వార్నింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్, లో-స్పీడ్ ఫాలో వంటి ADAS ఫీచర్లను కలిగి ఉంది. ZX ట్రిమ్‌లో మాత్రమే ADAS లభిస్తుంది, దీని ధర రూ. 11.58 లక్షల నుంచి రూ. 16.20 లక్షల మధ్య ఉంటుంది. సిటీ తర్వాత ADAS అందిస్తున్న రెండవ హోండా కారు ఇది.

*కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్:* ఇది 2023, జులైలో లాంచ్ అయిన కియా సెల్టోస్ SUVకి రిఫ్రెష్ వెర్షన్. ఇది స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ వంటి 17 ADAS ఫీచర్‌లతో సహా అనేక మంచి ఫీచర్లను కలిగి ఉంది. మీరు ADASని GTX+, X-లైన్ వేరియంట్‌లలో పొందవచ్చు, దీని ధర 10.90 లక్షల నుంచి 20.30 లక్షల రూపాయల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్).

*హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్:*
2024, జనవరిలో రిలీజ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు రియర్ పార్కింగ్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ADAS ఫీచర్లను కూడా కలిగి ఉంది. మీరు మొదటి రెండు ట్రిమ్‌లలో ADASని పొందవచ్చు, దీని ధర 10,99,900, 20,14,900 రూపాయల మధ్య ఉంటుంది.