Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

New ration cards : రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి… వచ్చే నెలలోనే కొత్తగా కొంగొత్తగా

బ్రేకింగ్ న్యూస్

రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి… వచ్చే నెలలోనే కొత్తగా కొంగొత్తగా

ప్రజా దీవెన, హైదరాబాద్‌: రేషన్‌ కార్డుల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదు రుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. అక్టోబరులో కొత్త రేషన్‌కార్డులు ( ration cards) జారీ చేయాలని స ర్కారు సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలకు ( to guidelines) తుదిరూపు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.

అక్టోబరు 2న గాంధీ జయంతి (Gandhi Jayanti) లేదా మరో రోజు నుంచి కార్డుల కోసం దరఖాస్తు లను స్వీకరించి, అదే నెలలో స్మార్ట్‌ కార్డులను( smart cards) ఇవ్వాలని భావిస్తోంది. ఇవి జేబులో పట్టేంత పరిమాణం లో ఉండనున్నాయి. రేషన్‌షాపులో కార్డును స్కాన్‌ చేయగానే బియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నా రు.

సోమవారం రేషన్‌కార్డులు, హెల్త్‌కా ర్డులపై( health cards) మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ అధ్యక్షతన జలసౌధలో ( jalasow dha) జరిగింది. దీనికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ( pongu lati srinivas red dy) హాజరయ్యారు. ఈ సందర్భంగా సమా వేశం వివరాలను మంత్రి ఉత్తమ్‌ ( uttam kumar Reddy) వెల్లడించారు. రేషన్‌కా ర్డుల కోసం అక్టోబరులో దరఖాస్తు లను స్వీకరిస్తామని ప్రకటించారు.

రేషన్‌, హెల్త్‌కార్డుల ను వేర్వేరుగా ఇస్తామని చెప్పారు. కార్డుల జారీకి సంబంధించిన మార్గ దర్శకాలకు నెలాఖరులోగా తుది రూపు ఇస్తా మని తెలిపారు. ఉమ్మ డి రాష్ట్రంలో తెలంగాణలో ( telangana) 3,38,0 7,794 జనాభాకుగాను 91,68, 231 కార్డులు ఉండేవని, వివిధ కారణాలతో 2,46,324 కార్డులను రద్దు చేశారని పేర్కొన్నా రు. ప్రస్తు తం రాష్ట్రంలో 3.81 కోట్ల మందికి 89.96 లక్షల కార్డు లున్నాయని తెలిపారు.

ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్రం ఖాతాలో 54.45 లక్షల కార్డు లు (1.91 కోట్ల మంది)కి ఉండగా కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతీ మనిషికి ఐదు కిలోల బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిలో బియ్యం అందుతున్నాయని స్పష్టం చేశారు. మరో 35.51 లక్షల కార్డులు (90.01 లక్షల మందికి) రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో ఉన్నాయని ఇందులో ఒకొక్కరికి 6 కిలోల బి య్యం వస్తున్నాయని తెలి పారు.

కార్డుల జారీకి ఒక్కో రాష్ట్రం లో ఒక్కో నిబంధన ఉందని, దీనిపై అధ్యయనం చేశామని వెల్లడించారు. ఆదాయ పరిమితిపై అధ్య యనం జరుగుతోందని తెలిపారు. కార్డుల జారీపై వివిధ రాజకీయ పక్షాలు, ఎంపీలు ( mp) , ఎమ్మెల్సీలు ( mlc) , ఎమ్మెల్యే (mla ) లకు లేఖలు రాశామని, ఈనెల 19లోపు వారి అభిప్రాయాలు చెప్ప డానికి గడువు ఇచ్చామని పేర్కొన్నారు. 21న మరోమారు మంత్రివర్గ సమావేశంలో చర్చిం చిన తర్వాత నెలాఖరులోగా మార్గ దర్శకాలకు తుదిరూపు ఇస్తామ ని వెల్లడించారు.

కార్డుల జారీ అనంతరం జనవరి నుంచి రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు. కాగా, ఖరీఫ్‌ ( kharif ) ధాన్యం సేకరణ అక్టోబరులో ప్రారంభం కానుందని, ఈ సీజన్‌ నుంచే సన్న వడ్లకు రూ.500 బోనస్‌ ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నామని మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు. ఎన్ని కల తాయిలాలుగా కార్డులిచ్చా రు: పొంగులేటి గత పదేళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు 49,476 మాత్ర మేనని అది కూడా ఉప ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపిం చుకోవడానికి మాత్రమే జారీ చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు.

పదేళ్లలో 5,98,000 కార్డు లను రద్దు చేయగా.. 6,47,479 కార్డు లు జారీ చేశారని అంతిమం గా ఇచ్చిన కార్డులు 49 వేలు మాత్ర మేనని తెలిపారు. గతంలో రేషన్‌ కార్డులు, ఆసరా పెన్షన్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పట్టాలు ఉప ఎన్ని కలు వచ్చినప్పుడే ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ( state) అర్హులం దరికీ అక్టోబరులో రేషన్‌ స్మార్ట్‌ కార్డులు, హెల్త్‌కార్డులు వేరుగా జారీ చేస్తామని ప్రకటించారు. కార్డు ల జారీపై ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తామని ఇప్పటిదాకా 15–16 మంది ప్రజా ప్రతినిధులు మాత్రమే కార్డులపై అభిప్రాయాలు తెలియజేశారని శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

New ration cards