Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NIA serchings : హైదరాబాద్‎లో ఎన్ఐఏ సోదాలు

--వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో

హైదరాబాద్‎లో ఎన్ఐఏ సోదాలు

–వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో

ప్రజాదీవెన, హైదరాబాద్: హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లోఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఎల్బీనగర్ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న రవిశర్మ ఇంట్లో ఎన్ఐఏ (nia ) సోదాలు జరిగాయి. మావోయిస్టు లతో సంబంధాలు ఉన్నాయంటూ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, హిమాయత్ నగర్‌లో వరవరరావు అల్లుడు వేణు గోపాల్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ గా వేణుగోపాల్ ఉన్నారు.

మావోయిస్టులతో (mavoist )సంబంధాలు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గురు వారం ఉదయం 4 గంటల నుంచి సోదాలు జరిగాయి. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు చేశారు. పత్రిక ప్రకటన ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.

ఇటీ వల మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ దీపక్‌ను కూకట్‌ప ల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీపక్ దగ్గర దొరికిన సమాచారం మేరకు వేణు నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.

సెర్చ్ వారెంట్‌తో వచ్చామన్నారు: వేణు

సోదాల తర్వాత వేణు మీడియాతో మాట్లాడుతూ ఇవాళ గురు వారం ఐదు గంటలకు తమ ఇంటికి వచ్చారని చెప్పారు. సెర్చ్ వారెంట్‌తో వచ్చామని అన్నారని వివరించారు. 2013లో నయీమ్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశానని తెలిపారు. ఆ పుస్తకాలను తీసుకెళ్లారని చెప్పారు. తన మొబైల్ సీజ్ చేశారని అన్నారు.

దీపక్‌కు, తనకు సంబంధం ఉందని కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కేసుపై గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి లేఖ రాశానని చెప్పారు. తాను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచురితం అయ్యిందని తెలిపారు. దేశంలో ఎన్ఐఏ ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, జనవరి 3వ తేదీ తనపై పెట్టిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసుకుందని చెప్పారు.

ఈ కేసులో ఏ-22గా తన పేరును చేర్చారని తెలిపారు. తాను ఒక మాస పత్రిక నడుపు తున్నానని చెప్పారు. కబలి దళం మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొ ట్టడానికి ప్రయత్నాలు చేసినట్టు కేసు పెట్టార న్నారు. తాను విరసంలో ప్రస్తుతం లేనని వివరించారు.

జర్నలిస్టు వేణుగోపాల్ పై NIA దాడిని ఖండిస్తున్నాం..సీనియర్ జర్నలిస్టు, వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ పై NIA దాడు లను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం తీవ్రం గా ఖండిస్తుందని tuwj143 అధ్యక్ష కార్యదర్శులు అల్లం నారాయ ణ, అస్కాని మారుతీసాగర్ పేర్కొన్నారు.

సుమారు దశాబ్దాలుకు పైగా జర్నలిజంలో వివిధ హోదాల్లో పని చేసి న వేణుగోపాల్ ఎప్పుడు ప్రజా పక్షమే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామిక వాదులపై చేస్తున్న దాడుల్లో భాగమే వేణుగోపాల్ పై NIA దాడి అంటూ TUWJ రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.