Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 2:29 pm Posted by : praja deveena

Nizamabad ACB Subinspector arrested: బిగ్ బ్రేకింగ్, బోధన్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు, ఎస్సై భాస్క రాచారి అరెస్ట్ 

Nizamabad ACB Subinspector arrested : ప్రజా దీవె న, నిజామా బాద్: నిజా మాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరి సరాలు అకస్మాత్తుగా టె న్షన్ వాతావరణంతో మార్మోగాయి. సాధారణ రోజు అనుకున్నది, ఒక్కసారిగా అ వినీతి వ్యతిరేక చ ర్యతో హాట్‌స్పాట్‌గా మారింది. సబ్ఇన్‌ స్పెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న చితన్నోజు భాస్కరచారి అ నే అధికారి ఒక కేసులో “సహాయం” పేరుతో చీకటి ఒప్పందా నికి తెరతీశారు. ఫిర్యాదుదారుని కుటుంబ సభ్యుడిని నేర కేసులో ఇరికించకుండా ఉండేందుకు మొదట రూ. 10,000 లం చం డిమాండ్ చేసిన ఆయన చివరికి చర్చల తర్వాత ఆ మొత్తాన్ని రూ.7వేలకు తగ్గించారు.

కానీ టెక్నాలజీ యుగంలో అవినీతి దాగడం అంత సులభం కాదు. ముందుగానే సమాచారం అందు కున్న అవినీతి నిరో ధక శాఖ (ACB), ఖచ్చితమైన ప్రణాళికతో రంగంలోకి దిగిం ది. పోలీస్ స్టేషన్ ద గ్గ రే, నగదు స్వీకరిస్తున్న క్షణంలోనే, అ ధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టు కుంది. ఆయన సూచనల మేరకు తీసుకున్న రూ. 7వేల నగదును సాక్ష్యంగా స్వాధీ నం చేసుకుంది.ఈ ఘటనతో ప్రభుత్వ బాధ్యతల పై నమ్మ కాన్ని దెబ్బతీసే చర్యలు ఎంత త్వరగా బయటపడతాయో మరోసారి స్పష్టమైంది.

ఫిర్యాదుదారుని భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారి వివ రాలు గోప్యం గా ఉంచబడ్డాయి.అరెస్టు అనంత రం నిందిత అధికారిని హైదరా బా ద్ నాంపల్లి కోర్టులోని ప్రత్యేక న్యా యస్థానం ఎదుట హాజరుపరుస్తు న్నారు. కేసు దర్యాప్తు కొ నసాగుతోందని, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవ కాశం ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

అవినీతి పై మీ ఒక్క కాల్ చాల దు, మార్పుకు మార్గం చూ పుతుంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం డి మాండ్ చేసినా, వెంటనే 1064 (టోల్ ఫ్రీ) కు కాల్ చేయండి. అదనంగా Wh atsApp (94404 461 06), Facebook, X వంటి డిజిట ల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా సమాచారం అందించవచ్చ న్నారు.