No more ‘India’ in Google: గుగూల్ లో ఇకపై ‘ భారత్ ‘
-దక్షిణఆసియా దేశంగా భారత్ కు గుర్తింపు --ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ భారత్ అనే పదానికే మొగ్గు
గుగూల్ లో ఇకపై ‘ భారత్ ‘
–-దక్షిణఆసియా దేశంగా భారత్ కు గుర్తింపు
–ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ భారత్ అనే పదానికే మొగ్గు
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్త సమాచారాన్ని క్షణాల్లో మనముందు ఆవిష్కరించే అద్భుతమైన గని గుగూల్ అని మనందరికి తెలుసు. మనకేదైనా అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ అడ్రస్ కోసం వెతికితే దారి చూపిస్తుందన్న ( If we don’t know any address, open Google Maps and search for that address and it will show us the way) విషయం కూడా విదితమే. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఎన్నో ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ లో వాటి ఫొటోలతో సహా గుర్తించవచ్చు.
ఆయితే ప్రస్తుతం మన దేశం కూడా గూగుల్ మ్యాప్స్ లో మన జాతీయజెండా గుర్తుతో సహా కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్ లో ‘Bharat’ అని టైప్ చేస్తే జాతీయజెండాతో సహా దక్షిణాసియాలో ఒక దేశంగా ( If you type ‘Bharat’ in Google Maps, you will see a country in South Asia including the national flag) చూపిస్తుంది. ఇందుకు భాషతో సంబంధం లేదు. సెర్చ్ లో భారతదేశం అని వెతికినా, భారత్ అని వెతికినా దక్షిణ ఆసియా దేశంగానే గుర్తించబడుతుంది.
గూగుల్ మ్యాప్స్ హిందీ వెర్షన్‌లో “भारत”ని ( “India” in Hindi version of Google Maps) చూపుతుంది. అదే ఇంగ్లీష్ లో సెర్చ్ చేస్తే భారత్, ఇండియా కు సంబంధించిన శోధన ఫలితాలు కనిపిస్తాయి. అధికారిక సమాచార మార్పిడిలో కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా ఇండియాకు బదులుగా భారత్ ను ఉపయోగిస్తున్న నేపథ్యంలో గూగుల్ కూడా దానినే పాటిస్తున్నట్లు ( In the context of the central government slowly using Bharat instead of India in official information exchange, Google is also following the same) తెలుస్తోంది.
కేవలం గూగుల్ మ్యాప్స్ లోనే కాదు శోధన, అనువాదం, వార్తలు, ఉత్పత్తుల్లో కూడా గూగుల్ తన వినియోగదారులకు సారూప్య ఫలితాలను అందించేందుకు భారత్, భారతదేశం అనే పదాలనే ఎంపిక (Google chose the words Bharat and India to provide similar results to its users)చేసుకుంటోంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గానికి రైల్వే మంత్రిత్వ శాఖ “ఇండియా” ను తొలగించి దాని స్థానంలో “భారత్” అని చేర్చాలని ప్రతిపాదించింది.
అందుకే గూగుల్ కూడా.. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనూ భారత్ అనే పదాన్నే ఉపయోగించేందుకు మొగ్గు చూపుతోంది. హిందీలో “हिंदुस्तान”, “भारतवर्ष” అనే పదాలను కూడా గూగుల్ తన సెర్చింజన్ లో చేర్చింది.