Not all of them apply: వారందరూ దరఖాస్తు చేసుకోవద్దు
--రైతు భరోసా, పింఛన్ల లబ్ధిదారులు యధావిదిగానే --గ్యారంటీల దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయి --రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే --అవసరమైతే వెంటనే మెగా డీఎస్సీకి ఏర్పాటు చేయండి --అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వారందరూ దరఖాస్తు చేసుకోవద్దు
–రైతు భరోసా, పింఛన్ల లబ్ధిదారులు యధావిదిగానే
–గ్యారంటీల దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయి
–రాష్ట్రంలో ప్రతి పల్లెలో ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే
–అవసరమైతే వెంటనే మెగా డీఎస్సీకి ఏర్పాటు చేయండి
–అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన/ హైదరాబాద్: రైతుబంధు, పింఛన్లపై ఎలాంటి అపోహలకు పోవద్దని, పాత లబ్దిదారులందరికీ యధావిధి గా పథకాలు అందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ప్రజలకు అవస మైన దరఖాస్తులను అందుబాటులో ఉంచా ల్సిందే నని, ప్రజాపాలనలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావా లని సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలన దరఖా స్తుల ప్రక్రియ సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రితో శనివా రం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భం గా గతంలో లబ్ది పొందనివారు, కొత్తగా లబ్ధి పొందాల నుకునేవారు మాత్రమే దరఖా స్తు చేసుకోవాలన్నారు. ఈ విషయం లో ప్రజలు ఎలాంటి గందరగోళా నికి గురి కావద్దని చెప్పారు. రాష్ట్రం లో ఈనెల 28వ తేదీ నుంచి ప్రజా పాలన ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దర ఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సం బంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రతి పల్లెలో పాఠశాల ఉండాల్సిందే… తెలంగాణలోని ప్రతీ గ్రామ పంచాయతీల్లో పాఠశాల ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారు లను ఆదేశించారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఎక్కడా కనిపించొద్దని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాల యంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహిం చిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో ఎంత చిన్న గ్రామమైన, మారుమూ ల తండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే నని స్పష్టం చేశారు.
విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనని రేవంత్ ఆదేశించారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలను తీసుకోవాలని అధికారులకుసూచించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి డీఎస్సీ నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాశాఖ, పరిశ్ర మల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నత విద్య మండలి చైర్మన్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్య దర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ దేవసేన, సీఎంఓ అధికారులు శేషాద్రి, షానవాజ్ ఖాసీం తదితర అధికారులు పాల్గొన్నారు.