NTR jayanthi: తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడుఎన్టీఆర్.. ప్రభాకర్
లుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా మంగళవారం కోదాడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఓరుగంటి.
.ప్రజా దీవెన, కోదాడ: తెలుగుదేశం పార్టీ(TDP) వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్(NTR) 101వ జయంతి సందర్భంగా మంగళవారం కోదాడ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఓరుగంటి. ప్రభాకర్(Oruganti Prabhakar) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు వన్నె తెచ్చిన మహనీయుడని,బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో పెద్దపీట వేసి సినీ రంగం, రాజకీయ రంగంలో తనదైన శైలిలో ప్రజల ఆధర అభిమానాలు పొందడంతో పాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రజలకు(Telugu people)పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని, తెలుగుజాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.
అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జనపనేని. కృష్ణారావు, రాష్ట్ర రైతు సంఘం నాయకులు కొల్లు. వెంకటేశ్వరరావు, ముండ్రా. మల్లికార్జున్, వేమూరి. సురేష్,యర్ర.లక్ష్మీనారాయణ, మైక్. నాగుల్, గౌను. శ్రీనివాస్ గౌడ్, రంగాచారి, అప్పారావు, టేకుమట్ల. దుర్గారావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
NTR 101th jayanthi celebrations