అవినీతి విచారణ నివేదికలెక్కడ
బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిని అవినీతికి సంబందించిన విచారణ నివేదికలు ఎందుకు బహిర్గతం కావడం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంఛార్జి ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు.
బహిర్గతం చేయకుండా ఎక్కడ దాచారు
పారదర్శకమైన నివేదికలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంఛార్జి ఎన్వీ సుభాష్
ప్రజా దీవెన, హైదరాబాద్: బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిని అవినీతికి సంబందించిన విచారణ నివేదికలు ఎందుకు బహిర్గతం కావడం లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంఛార్జి ఎన్వీ సుభాష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన తప్పులపై విచారణకు ఆదేశాలు జారీ చేస్తామ ని పలుమార్లు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటిలో ప్రముఖమైనవి ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఫోన్ టాపింగ్ లాంటివాటి కి సంబందించిన విచారణ పారదర్శకంగా జరిపి ఎటువంటి దాపరికం లేకుండా వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.
వీటిని రహస్యంగా ఉంచ డంతో పలు అనుమానాలకు తావి స్తోందని సందేహం వ్యక్తం చేయడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి జరిగిన అవకతవక లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం, కేంద్రంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక నివేదిక సమర్పించింది. ఈ రెండు నివేదికలు కూడా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవక లను, లోపాలను బట్టబయలు చేయడంతో పాటు అసలు ఏం జరిగిందని అంశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులను కాపాడేందుకే ఈ నివేదికలు ఏవి కూడా పబ్లిక్ డోమైన్ లో పెట్టడకుం డా రహస్యంగానే ఉంచుతోందని ఆరోపించారు.
తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని, గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదలబోమని పదేపదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటనలు చేశారు. అయితే మేడిగడ్డ, ఫోన్ టాపింగ్ విషయంలో అధికారులను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ, వీటి వెనక ఉన్న బీఆర్ఎస్ నాయకుల గురించి ఒక్క మాటకూడా మాట్లాడడం లేదని విమర్శించారు. విచారణ వ్యవహా రం మొత్తం బయటకు వస్తే అది ఎవరి పీకలకు చుట్టుకుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయ కులకు అవగాహన ఉండి ఉంటుం ది, అందుకే దీనిని పబ్లిక్ డొమై న్లో పెట్టడం లేదేమోనన్న అనుమానం వ్యక్తం అవుతోoదని అరూపించారు.