
OCTOPUS commandos on-duty Telangana Civil Supplies : ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణలో ప్రభు త్వ ధాన్యం బకాయిపడ్డ రైస్ మిల్లర్ల నుండి వసూలు చే య డంలో ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. బియ్యం బ కాయిలు చెల్లించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న మిల్ల ర్లపై కఠిన చర్యలకు సివిల్ సప్లైస్ శాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మం ది అత్యుత్తమ కమాండోలను ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభా గాల్లోకి రంగంలోకి దించింది.
సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం సివిల్ సప్లైస్ భవన్‌లో ఉన్నతస్థాయి స మావేశం నిర్వహించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమాం డోలకు స్వాగతం ప లికిన ఆయన వారికి అప్పగించాల్సిన బాధ్యతలపై స్పష్టమై న దిశానిర్దేశం చేశారు.సివిల్ సప్లైస్ శాఖ కార్య కలాపాలు పోలీసులకు కొత్త కా వడంతో ఇప్పటికే మూడు రోజు లపా టు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు కమిషనర్ తెలిపారు. నిత్యావ సర వస్తువుల చట్టాలు, శాఖ ని బంధనలు, తనిఖీల విధా నం తదితర అంశాలపై తెలంగాణ పోలీస్ అకాడమీలో వా రికి అవగా హన కల్పించినట్లు వెల్లడించారు.
154 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
గత ఖరీఫ్ సీజన్ KMS 2025- 26లో రికార్డు స్థాయిలో 15 4 లక్ష ల మెట్రిక్ టన్నుల వడ్లను సేక రించినట్లు కమిషనర్ గుర్తుచేశా రు. రైతులకు అండగా నిలిచేందుకు ధాన్యం కొ నుగోళ్ల కోసం రా ష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
మిల్లర్లపై ఇక ముమ్మర తనిఖీలు
ఆకస్మిక తనిఖీల్లో ప్రత్యేక శిక్షణ పొందిన కమాండోల సామ ర్థ్యాన్ని ఇకపై సివిల్ సప్లైస్ శాఖ పూ ర్తిస్థాయిలో వినియో గించుకోనుంది. వీరిని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగాల కిం ద ప్రత్యేక టా స్క్‌ఫోర్స్ బృందాలుగా ఏర్పాటు చేయనున్నా రు.బకాయిలు ఉన్న మిల్లర్లపై రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థా యి లో తనిఖీలు నిర్వహించేందుకు ఈ బృందాలు త్వరలోనే రంగంలోకి దిగనున్నాయి. దీంతో ప్రభుత్వ ధాన్యం బకాయి ల విషయంలో మిల్లర్లపై ఒత్తిడి మరింత పెరగనుంది.
ఉపేక్షించేది లేదు కమిషనర్ హెచ్చరిక
ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినా, నిబంధనలను ఉ ల్లంఘించినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిం చే మిల్లర్లపై క్రి మినల్ కేసులు నమోదు చేయ డంతో పాటు కఠినమైన చట్టపర మైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.మొత్తానికి ప్రభుత్వ ధాన్యం బకాయిల వ్యవహా రంలో తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ ఇక “ఆపరేషన్ మిల్ల ర్స్” మోడ్‌లోకి వెళ్లినట్లు గా కనిపిస్తోంది. 28 మంది క మాం డోల రంగప్రవేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు, చర్యలు మ రింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. దీంతో బకాయి ప డ్డ బడామిల్లర్ల నుంచి సీఎంఆర్ వసూళ్లకు దారిపడిందని చెప్పవచ్చు.





