Praja Deveena
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 8:56 am Posted by : praja deveena

Odisha Septic Tank Accident : బిగ్ బ్రేకింగ్, ఒడిశాలో ఘోర విషా దం, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్‌లో ఊపి రాడక ఆరుగురి దుర్మరణం 

Odisha Septic Tank Accident : ప్రజా దీవెన, భువనేశ్వ ర్: సాంకేతి కత ఎంత ముందుకు దూసుకుపోతున్నా, క్షేత్ర స్థాయిలో కార్మికుల భద్రత కరువవుతోందనే చేదు నిజా నికి ఈ ఘటనే నిదర్శనంగా నిలు స్తోందని చెప్పవచ్చు. ఒడిశా లోని కలహాండి జిల్లా కరియాఖుంటా గ్రా మంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేం దుకు దిగిన ఆరుగురు కార్మి కులు, అందులో వెలువడిన ప్రాణాంతక విషవాయువుల (Toxic Gases) బారిన పడి అక్కడికక్కడే శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోయారు.

సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.కరియాఖుంటా గ్రామం లో కొత్తగా నిర్మిస్తున్న ఒక సెప్టిక్ ట్యాంక్ పనుల కో సం కార్మికులు లోపలికి దిగారు. అయితే, మూసి ఉంచిన ఆ ట్యాంక్‌లో అప్పటికే ప్ర మాదకరమైన వాయువులు పేరు కు పోయి ఉన్నాయి. వారు లోప లి కి వెళ్లిన కొద్దిసేపటికే ఆ వా యువు లను పీల్చి, ఊపిరి ఆడక ఒక్కొక్కరుగా అపస్మా రక స్థితికి చేరుకున్నా రు. బయట ఉన్నవారు గమనించే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది.

     రంగంలోకి సహాయక బృందాలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వ హణ బృందాలు ఘటనాస్థలానికి చేరు కున్నాయి. రక్షణ క వచాలు ధరించి ట్యాంక్ లోపలి నుంచి మృతదేహా లను వె లికితీశారు. గ్రామంలో ఒ క్కసారిగా ఆరుగురు ప్రాణాలు కో ల్పోవడంతో స్థానికంగా తీవ్ర ది గ్భ్రాంతి, విషాద ఛాయలు అల ముకున్నాయి. ఇలాంటి మానవీ య లోపాలు, కనీస భద్రతా ప్రమా ణాలు పాటించకపోవడం వల్లే అ మాయక కార్మికులు బలైపోతు న్నారని, ఇకనైనా ఇలాంటి పనుల్లో మనుషులకు బదులు పూర్తిగా రో బోటిక్ టెక్నాలజీని వాడాల్సిన అ వసరం ఎంతైనా ఉందని స్థానిక సా మాజిక కార్యకర్తలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.

ప్రభుత్వ సాయం, విచారణకు ఆదేశం

ఈ ఘోర ప్రమాదంపై ఒడిశా ము ఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కా ర్మికుల కుటుంబా లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇ స్తూ, ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రక టించారు.అదే సందర్భంలో ఈ ఘటనకు గ ల కారణాలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు.

ఈ ఘటన మనకు నేర్పే పాఠం ఒ క్కటే ట్యాంకులు, డ్రైనే జీల క్లీనిం గ్స్ విషయంలో మనుషుల ప్రాణా లను పణంగా పెట్టే పద్ధతులకు స్వస్తి పలకాలని స్మార్ట్ డిటెక్టర్లు, గ్యాస్ సె న్సార్లు మరియు అడ్వా న్స్‌డ్ మెషినరీని వాడటం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి ముక్కు పచ్చలారని ప్రాణాలు గాల్లో కలవకుండా కాపాడుకోగలమని సాంకే తిక నిపుణులు భావి స్తున్నారు.