Odisha to Nalgonda Drug Smuggling : ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: నల్ల గొండ పోలీసుల మెరుపు దాడితో అం తర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. 8 మంది రౌడీ షీ టర్లు, కిలాడీలు అరెస్ట్ రూ. 10 లక్షల సొత్తు స్వాధీనం చేసు కున్నారు నల్లగొండ వన్ టౌన్ పోలీ సులు. నల్గొండ జిల్లాను గంజాయి రహిత జిల్లా’గా మార్చాలన్న ఎస్పీ శరత్ చంద్ర ప వార్ పక్కా స్కెచ్‌తో డీఎస్పీకె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో న ల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రె డ్డి బృం దం ఓ భారీ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా ఆట కట్టించింది.
సినిమా ఫక్కీలో దొంగతనాలు.. డ్రగ్స్ డీల్స్
ఈ ముఠా మామూలు ముఠా కాదు. సులభంగా డబ్బు సం పాదిం చడం, మత్తు పదార్థాలకు బాని సలు కావడం కోసం వీరు వేసిన ప్లాన్ ఏంటో తెలుసా. నగరంలో ఎంచక్కా తిరు గుతూ బైక్‌లు ఎ త్తుకెళ్లడం (ఖమ్మం, నకిరేకల్, న ల్గొండలో రికవరీ అయిన బైక్స్) కాగా హైదరాబాద్ లో దొంగిలించి న బైక్‌లను ఒడిశాలోని మెయిన్ సప్లయర్ మనుకర్ (A-5) వద్దకు తీసుకెళ్లి, వాటికి బదులుగా రూ. 90,000 విలువైన 12 కిలోల గం జాయి, రూ. 1,00,000 విలువైన 500 ML వీడ్ (హాష్) ఆయిల్ కొ నుగోలు చేశారు.
తెచ్చిన స్టాక్‌ను చిన్న చిన్న ప్యా కెట్లుగా మార్చి కాలేజీ వి ద్యార్థు లకు, యువతకు అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకో వ డం వీరికి పరిపాటి. ఎవరైనా అ డ్డు వస్తే భయ పెట్టడానికి డమ్మీ తుపాకీ దాడి చేయడానికి ఒక బటన్ చా కు కూడా ఎప్పుడూ లగేజీలోనే.
స్పాట్‌లోనే వ్యూహాత్మకంగా లాకేసిన పోలీసులు
ఉదయం 11:00 గంటలకు ము నుగోడు బైపాస్ రోడ్డులోని ఖాళీ స్థలంలో గ్యాంగ్ అంతా కలిసి గం జాయి విక్రయిస్తు న్నారనే గూఢ చారి సమాచారం రాగానే.. వన్ టౌన్ పోలీ సులు లొకేషన్‌ను చు ట్టుముట్టారు. పోలీసులను చూ సి తప్పించుకునేందుకు పారి పో తుండగా 8 మంది నిందితు లతో పాటు ఒక మైనర్‌ను పోలీసులు ఎoతో చాకచక్యంగా పట్టుకున్నారు.
అరెస్ట్ అయిన నిధితుల్లో A-1 కస్పరాజు నాగరాజు( 20), A-2 గంటెకంపు మధు @ కిరణ్ (22) విద్యార్థి (గతంలోనే 15 కేసుల నిందితుడు. A-3 చెన్నపాక సు శాంక్ @ డెడ్లీ (23),A-4 పెండ్ర వాసు @ చింటు (19) – కేటరిం గ్, A-7:** సయ్యద్ షోయబ్ @ షోబి (21) – వెల్డింగ్, A-8 గం ధం శివమణి (19) – డెకరేషన్ వర్కర్, A-9 చెరుకు దీపక్ @ ప ల్లి (19) – చికెన్ షాప్, A-10 న కిరేకంటి ధరణి కుమార్ @ బబ్లు (19) – డెకరేషన్ వర్కర్ తో పా టు మరొక మైనర్ బాలుడు అ దుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఒడిశా సరఫ రాదారు మనుకర్ (A-5), హరి (A-6), ఉదయ్ (A-11), జున్ను (A-12) ప్రస్తుతం పరారీలో ఉ న్నారని, వారి కోసం వేట కొనసా గు తోం దని నల్లగొండ డీఎస్పీ శివ రాం రె డ్డి శనివారం ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో వెళ్లించా రు.
వీరి వద్ద నుంచి మొత్తంగా సు మారు రూ. 10 లక్షల విలు వైన వి స్వాధీనపరచుకున్నట్లు పోలీ సులు తెలిపారు.5.6 కిలోల గం జాయి, 100 ML వీడ్ (హాష్) ఆ యిల్, వాహనా లు | 5 బైక్‌లు |మొబైల్స్ | 4 సెల్‌ఫోన్లు, ఆయు ధాలు 1 డ మ్మీ తుపాకీ, 1 బటన్ చాకు స్వాధీనపరచుకొన కేసు న మోదు చేసుకున్న ఈ ఘటనపై Cr.No. 190/2026 NDPS Ac t కింద కేసు నమోదు చేసి నిం ది తులను రిమాండ్‌కు తరలించా రు.
మత్తు పదార్థాలతో యువత జీ వితాలను నాశనం చేసుకో వ ద్ద ని, జిల్లాలో డ్రగ్స్, గంజాయి అ క్రమ రవాణాపై ఉక్కు పాదం మో పుతాం. మీ పరిసరాల్లో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కని పిస్తే వెంటనే Dial 100 కు గానీ, స్థానిక SHO కి గానీ సమాచారం ఇవ్వండి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని శివ రాం రెడ్డి ప్రకటించారు. స కాలం లో స్పందించి ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చే సిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశే ఖర్ రెడ్డి, ఎస్.ఐ లు ముత్తయ్య, సంపత్ మరియు పోలీస్ సిబ్బం దికి జిల్లా ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.


