Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 1:03 pm Posted by : praja deveena

District Collector Badugu Chandrasekhar: ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంతో కళల ప్రోత్సాహానికి అవకాశాలు 

 

District Collector Badugu Chandrasekhar : ప్రజా దీ వెన నల్లగొండ: ప్రధానమం త్రి విశ్వకర్మ పథకం కింద చేతివృ త్తుల కళల ప్రోత్సాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని, అందువ ల్ల లబ్ధిదారులు కష్టపడి వ్యాపారాలను వృద్ధి చేసు కోవాలని జిల్లా క లెక్టర్ బడుగు చంద్రశేఖర్ పిలుపు నిచ్చా రు. శుక్రవారం నల్లగొండ జి ల్లా కేంద్రంలోని బోయవాడ ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్ లో సూక్ష్మ,మధ్య ఔత్సాహిక పారిశ్రామి కవేత్తల సం స్థ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ని ర్వహించ ను న్న ప్రధానమంత్రి విశ్వ కర్మ లబ్ధిదారుల వాణిజ్య ప్రదర్శన ను కలెక్టర్ ప్రారంభించారు.

లబ్ధిదారులు ఏర్పాటు చేసిన వివిధ చేతి వృత్తులను పరిశీ లించిన అ నంతరం లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎంఎస్ఎం ఈ ఆ ధ్వర్యంలో చేతివృత్తుల కళాకృతుల ప్రో త్సాహంగా వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు మంచి అ వకాశం ఉందన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం ద్వారా మొ దటి విడుతన లక్ష రూపాయల రుణం మంజూరు చేయడం జరుగుతుందని, 18 నెలల్లో తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తే రెండవ విడత రెండు లక్షల రూపాయలను మంజూరు జరు గుతుందని చెప్పారు .ఎంఎస్ ఎం ఈ ద్వారా తక్కువ వడ్డీకి రుణం అం దుబాటులో ఉండడం వల్ల చిన్న చిన్న వ్యాపా రాలు నిర్వహించుకునే వారికి ఇది మంచిగా ఉపయోగప డుతుందని అన్నారు.

జిల్లాలో సుమారు 3580 మంది ల బ్ధిదారులు ఎంఎస్ ఎం ఈ కింద ద రఖాస్తులు చేసుకున్నారని, వారం దరికీ శిక్షణ నిర్వహించడం జరుగు తున్నదని, శిక్షణ పూర్తయిన తర్వా త వ్యాపార మెలకువలను అందిపుచ్చుకొని రుణంతో పా టు నైపు ణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని దీని ద్వారా మ రింత లబ్ధి పొంద వచ్చు అని అన్నారు.పి ఎం విశ్వ కర్మ 3 రోజుల వాణిజ్య ప్రదర్శన ద్వారా మార్కెట్ సదుపాయాలు, డిజిటల్ మార్కెట్ సౌకర్యం వంటి వాటిపై అవగాహన క ల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.

ఎంఎస్ఎం ఈ ద్వారా పొందిన ఋణంతో కష్టపడితే మంచి అవ కాశాలు ఉన్నాయని చెప్పారు. ఎం ఎస్ ఎంఈ ద్వారా అమలు చేసే ప థకాలపై విస్తృత ప్రచారం కల్పిం చాలని కలెక్టర్ చెప్పారు. ఈ సం దర్భంగా పలువురు లబ్ధిదారులు ఎంఎస్ ఎం ఈ ద్వారా రుణంపొంది వారు నిర్వహించుకుం టున్న వ్యాపారాలపై వివరించారు.ఎంఎస్ఎం ఈ సహాయ సం చాలకు లు నవీన్ మాట్లాడారు. జిల్లా పరిశ్రమల మేనే జర్ సతీష్, ఎల్డిఎం శ్రామిక్ ,మెప్మా పీడీ శ్రీని వాస్, బీసీ సంక్షే మ అధికారి సంజీవ, పోస్టల్ సూపరింటెండెంట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.