Orders for transfers of teachers: ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు
-- పదోన్నతులు పక్కనపెట్టీ కేవలం బదిలీలే చేపట్టాలని నిర్ణయం -- ఈ నెల 5వ తేదీన తుది జాబితా సీనియారిటీ జాబితా ప్రకటన
ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు
— పదోన్నతులు పక్కనపెట్టీ కేవలం బదిలీలే చేపట్టాలని నిర్ణయం
— ఈ నెల 5వ తేదీన తుది జాబితా సీనియారిటీ జాబితా ప్రకటన
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణలోని ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి కేవలం బదిలీలు (In two multizones in Telangana only transfers aside from promotions) మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది.ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం రిలీజ్ చేసింది.
రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులు, పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో (In Ranga Reddy districts, there are cases of TET eligibility for seniority and promotions, stays on promotions). విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. మల్టీజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), మల్టీజోన్ -2 పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మంగళ, బుధవారాల్లో అప్పీళ్లు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్డేట్కు (For updates on appeals, rank correction and vacancy correction on Tuesdays and Wednesdays) అధికారులు అవకాశం కల్పించగా ఈ నెల 5న తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు.
8న వెబ్ ఆప్షన్ల సైతం ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు.