Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Original seed: రైతులకు నాణ్యమైన విత్తనాల విక్రహించాలి. రెవిన్యూ డివిజనల్ అధికారి

కోదాడ పట్టణంలో శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ కోదాడ టౌన్ సీఐ రాము, తహసీల్దార్ సాయిగౌడ్, మరియు వ్యవసాయ అధికారి పాలెం రజనీ తో కలసి విత్తన దుకాణాలను తనిఖీలు నిర్వహించారు.

ప్రజా దీవెన,కోదాడ: కోదాడ(Kodada)పట్టణంలో శుక్రవారం కోదాడ రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ(Suryanarayana) కోదాడ టౌన్ సీఐ రాము, తహసీల్దార్ సాయిగౌడ్, మరియు వ్యవసాయ అధికారి పాలెం రజనీ తో కలసి విత్తన దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. అనంతరం దుకాణ యజమానులతో మాట్లాడుతూ రైతులకు(Farmers) నాణ్యమైన విత్తనాలు అమ్మాలని, బిల్ రశీదు(Bill receipt)ఇవ్వాలని,వ్యవసాయ సమయములు రైతులకు సరిపడ విత్తనాలను అందుబాటులో ఉంచాలని విత్తన డీలర్లులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన డీలర్లులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్మి శ్రీనివాస, సింధూర, భవాని, చంద్రారెడ్డి(Chandra Reddy)దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందీ. ఈ తనిఖీలో రైతులు, విత్తన డీలర్లు, అధికారుల పాల్గొన్నారు.

Original seeds sale to farmers