Padabandi plan for peaceful elections: ప్రశాంత ఎన్నికలకై పగడ్బంది ప్రణాళిక
- అరు నియోజకవర్గాల్లోనూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం --రేపటి నుండి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ ల దాఖలు --రిటర్నింగ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్ అమలు --అభ్యర్థులు తమ వాహనాలను 100 మీటర్ల దూరంలోనే పార్కింగ్ చేయాలి -- ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు --మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అపూర్వ రావు తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
ప్రశాంత ఎన్నికలకై పగడ్బంది ప్రణాళిక
–– అరు నియోజకవర్గాల్లోనూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
–రేపటి నుండి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ ల దాఖలు
–రిటర్నింగ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్ అమలు
–అభ్యర్థులు తమ వాహనాలను 100 మీటర్ల దూరంలోనే పార్కింగ్ చేయాలి
— ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు
–మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అపూర్వ రావు తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
ప్రజా దీవెన/ నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఆరు శాసన సభ నియోజక వర్గాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సకల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అపూర్వ రావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల కేంద్రాలైన దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి దేవరకొండ అర్.డి. ఓ కార్యాలయం లో నాగార్జున సాగర్ నియోజవర్గం పరిధి లో నిడమ నూర్ తహశీల్దార్ కార్యాలయంలో నల్లగొండ నియోజక వర్గం పరిధి లో నల్గొండ అర్.డి. ఓ కార్యాలయం లో, మునుగోడు నియోజకవర్గం పరిధి లో చండూర్ తహశీల్దార్ కార్యాలయం లో, నకిరేకల్ లో నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయం లో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆయా నియోజకవర్గ కేంద్రాలలోని రిటర్నింగ్ ఆఫీసులలో ఆర్ఓలు , ఏఅర్ఓ లు స్వీకరిస్తారని, తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లను నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని అన్నారు. నామినేషన్లు ఉదయము 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్వోలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయ ప్రాంగణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు అభ్యర్థులు తమ వాహనాలను 100 మీటర్ల దూరంలోనే పార్కింగ్ చేయవలసి ఉంటుందన్నారు. అదేవిధంగా ఆర్ఓ ఆఫీసుకు నామినేషన్ వేసే అభ్యర్థి వెంట నలుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని, మూడు వాహనాలు అనుమతించడం జరుగుతుందని తెలిపారు.
ఈనెల 13వ తేదీన నామినేషన్ వేసిన అభ్యర్థుల యొక్క ఫారాలను స్క్రుటిని చేస్తామని, 15వ తేదీన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోవాలనుకుంటే చివరి తేదీగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 30వ తేదీన ఉదయము 7 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 3 తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అన్నారు. డిసెంబర్ 5వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగిస్తామన్నారు. జిల్లాలో నవంబర్ 1 నాటికి మొత్తం 14,45,855 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1766 పోలింగ్ స్టేషన్లో ఉండగా, పట్టణ ప్రాంతాలలో 356, గ్రామీణ ప్రాంతాలలో 1410 ఉన్నట్లు తెలిపారు.
అంతేగాక ప్రతి నియోజకవర్గనికి 5 పోలింగ్ కేంద్రాలు చొప్పున మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు అరు నియోజక వర్గాలలో మహిళలు నిర్వహిస్తారని, నియోజవర్గం కు 5 చొప్పున మోడల్ పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గంకు ఒకటి చొప్పున అరు నియోజకవర్గాల్లో అరు పోలింగ్ కేంద్రాలు PWD సిబ్బంది నిర్వహిస్తారని, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మొత్తం అరు నియోజక వర్గాల్లో 5 పోలింగ్ కేంద్రాల యువత నిర్వహిస్తారని తెలిపారు.
ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ లేదా సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు. ఇప్పటివరకు మొత్తం జిల్లాలో జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా 206 కేసులకు సంబంధించి 33 కోట్ల 52 లక్షల 11 వేల 930 విలువ గల నగదు లేదా వస్తురూపమైన బంగారం, వెండి, డైమండ్స్ స్వాదీనం కేసులను పరిశీలించి అందులో భాగంగా 196 కేసులను పరిశీలించి 6 కోట్ల 35 లక్షల 14 వేల 860 రూ.లు కమిటీ రిలీజ్ చేసినట్లు తెలిపారు. 10లక్షలకు పైన ఉన్న పది కేసులను మాత్రం ఐటి డిపార్ట్మెంట్కు రిఫర్ చేసినట్లు ఆయన వివరించారు. ఎన్నికల విధులలో భాగంగా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎంసీఏంసి కమిటీ, డిస్టిక్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ, పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆరు నియోజకవర్గ కేంద్రాలలో ఇప్పటికే మొదటి దశ లో ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రెండవ ట్రైనింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫామ్ 12 డి ద్వారా 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు, కోవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుండి ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల లో భాగంగా ముగ్గురు ఎక్స్పెండిచర్ అబ్జర్వ్ ర్లను జిల్లాకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు రోహిత్ కుమార్ (ఐఆర్ఎస్), దేవరకొండ, మునుగోడు నియోజక వర్గాలకు సతీష్ గురుమూర్తి (ఐఆర్ఎస్), నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు డి.ఎం. నిమ్జే (ఐఆర్ఎస్) లను ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లుగా నియమించారు.
జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ, జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలలో ఆర్వో ఆఫీసుల వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తు చర్యలను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. నియోజకవర్గ ఆర్ వో ఆఫీస్ లో వద్ద 100 మీటర్ల దూరంలో ఇప్పటికే భారీ గేట్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పి సాయి అధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
పోలీస్ శాఖ తరపున ఫ్లైయింగ్ స్క్యాడ్ లు, చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీస్ బందోబస్తుకు సెంట్రల్ ఫోర్స్ తో కలిసి పోలీసులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. అదే విధంగా జిల్లాలో డబ్బు, మద్యం, విలువైన వస్తువుల రవాణాను ఎప్పటికప్పుడు చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేసి నిరోధిస్తామన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో తనిఖీ బృందాల ద్వారా నగదు, మద్యం, డ్రగ్స్, వస్తువులు, ఆభరణాలు 41 కోట్ల 22 లక్షల 31 వేల 431 రూ.ల విలువ గలని సీజ్ చేసినట్లు తెలిపారు . లా అండ్ ఆర్డర్ కచ్చితంగా అమలు చేసి ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ సమావేశంలో DPRO శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, ఎంసీఎంసీ నోడల్ ఆఫీసర్ హరి సింగ్, కలెక్టరేట్ ఏవో మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.