Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi: పాకిస్థాన్ వేసుకుంటామంటే గాజులు తొడిగిస్తాo

దాయాది దేశం పాకిస్థాన్ వద్ద వేసుకోవడానికి గాజులేమీ లేకపోతే తాము గాజులు తొడిగిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్య లకు ప్రధాని మోదీ కౌంటర్
మొదట పాకిస్థాన్ ను గోధుమ పిండి, కరెంటు సమకూర్చుకోమను
బీహార్ లోని ముజఫర్ పూర్ పర్య టనలో ప్రధాని మోదీ

ప్రజా దీవెన, బీహార్: దాయాది దేశం పాకిస్థాన్(Pakistan) వద్ద వేసుకోవడానికి గాజులేమీ లేకపోతే తాము గాజులు తొడిగిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi sensational comments) సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన పాక్ ఆర్థిక దుస్థితిని ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పిం చారు. ఇటీవలి ఓ బహిరంగ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొనడoపై ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కశ్మీర్ పార్టీ నేషన ల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దు ల్లా విమర్శలు గుప్పించారు.

పాకిస్థా న్ చేతికి గాజులు వేసుకుని ఏమీ కూర్చోలేదని, దాని దగ్గర అణు బాంబులు ఉన్నాయని, అవి వేస్తే భారత దేశానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. సదరు వ్యాఖ్యలపై సోమవారం బీహార్ లోని ముజఫర్ పూర్ పర్యటనలో ప్రధాని మోదీ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలకు(Farooq Abdullah comments) దీటైన సమాధానం ఇస్తూ పాకిస్థాన్ గాజులు వేసుకుని లేకుంటే మనం పాకిస్థాన్ గాజులు తొడిగిద్దామని ఎద్దేవ చేశారు. పాకిస్తాన్ కు ఆహారమైన గోధుమ పిండి, కరెంటు సక్రమంగా సమ కూర్చుకునే పనులు ఉండమని సూచించారు. ప్రస్తుతం వాళ్ల వద్ద చివరికి గాజులు కూడా లేవని నాకు ఇప్పుడే తెలిసిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో(Bihar) పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పట్నా లోని గురుద్వారాను సందర్శించా రు. సంప్రదాయ సిక్కుల తలపాగా ధరించి ప్రార్థనాలయంలోకి ప్రవేశిం చారు. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ నిర్మించిన శ్రీ పట్నా సా హిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థ నలు చేశారు.అనంతరం గురు ద్వా రాలోని వంటశాలలోకి ప్రధాని వెళ్లా రు. దైవ సేవలో భాగంగా పొయ్యిపై ఉన్న భారీ వంట పాత్రలో తయార వుతున్న పాయసం ప్రసాదాన్ని స్వయంగా గరిటెతో కలియది ప్పారు.

ఆ తర్వాత ఓ స్టీల్ బకెట్ లోకి ఆ ప్రసాదాన్ని తీసుకొని భక్తు లకు తన చేత్తోనే వడ్డించారు. అం తకుముందు రొట్టెలు కూడా ఒత్తా రు. తన దర్శన వివరాలతోపాటు ఫొటోలను మోదీ తన ‘ఎక్స్’ ఖాతా లో పోస్ట్ చేశారు. ఈ ఉదయం తఖ్త్ శ్రీ హరిమందర్ జీ పాట్నా సాహిబ్ లో ప్రార్థనలు చేశా. సిక్కు మతం సమానత్వం, న్యాయం, దయ సూత్రాలతో నిండినది. ఈ మతంలో సేవ ప్రధానమైనది. దైవ సేవలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇది నాకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది’ అని కామెంట్ ను జోడించారు. మరోవైపు మోదీ దైవ సేవలో నిమగ్నమైన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ ఐ తన ‘ఎక్స్’ ఖాతాలో నెటిజన్లతో పంచుకుంది. పట్నా ప్రాంతం సిక్కుల 10వ గురువు అయిన గురు గోబింద్ సింగ్ జన్మస్థలం కావడంతో ఈ గురుద్వారాకు విశేష ప్రాధాన్యం ఉంది.

Pakistan wear bangles says modi