Praja Deveena
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 1:02 pm Posted by : praja deveena

PCC Ex President MP : మాజీఎంపీ హనుమంతరావు ఆందోళన, కేంద్రంచర్యలతో దక్షిణాదికి తీరనినష్టం

మాజీ ఎంపీ హనుమంతరావు ఆం దోళన, కేంద్రంచర్యలతో దక్షిణాదికి తీరని నష్టం

PCC Ex President MP :  ప్రజా దీవెన, నల్లగొండ: డిలిమి టేషన్ దక్షిణ భారతానికి భారీ నష్టం చేస్తుందని మాజీ రా జ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (విహెచ్) ఘాటుగా హెచ్చరించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం ఆయ న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతతో కలిసి ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటువ్యాఖ్యలు చే శారు. జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయడం వల్ల దక్షిణానికి సీట్లు తగ్గే ప్రమాదముందని విహెచ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్ర తిప క్షా లతో చర్చించకుండా త న దైన శైలిలో డిలిమిటేషన్ చేపడుతోందని విమర్శించారు.

ఉత్తర భారత రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయని, దక్షిణ రాష్ట్రాల ప్రభావం తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా జరిగితే భవిష్యత్‌లో అధికారంలోకి రా వడం కొన్ని పార్టీలకు సులభమవుతుందని ఆయన ఆరో పించారు.జనగణనలో బాగంగా కులగణన (CasteCen s us) తప్పనిసరిగా ఉండాలని విహెచ్ డిమాండ్ చేశారు. జ నాభా ఆధారంగా హక్కులు ఉండాలని, బడ్జెట్‌లో సరైన వా టా దక్కాల్సిందేనని, రాజకీయ ప్రతి నిధిత్వం పెంపు జరగా ల్సిదేనని ఇ వన్నీ సాధ్యమవుతాయని ఆయన వివరించా రు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ లకు ప్రత్యేక కోట ఉండా లని డి మాండ్. అదేవిధంగా దేశంలో 60 శాతం పైగా ఉన్న బీసీల కోసం ప్ర త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చే యాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రభుత్వంపై విమర్శ లు గుప్పించారు.దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రయ త్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.కానీ భారత్ ఎ ప్పటికీ సెక్యులర్ దేశమేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 16న ఢి ల్లీలో కాoగ్రెస్ ఆ ధ్వర్యంలో భారీ ధర్నా తలపెట్టినట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, అనగారిన వ ర్గాల నాయకులు పెద్ద ఎత్తున పా ల్గొనాలని పిలుపునిచ్చారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగి తే సహించమని విహెచ్ తీవ్రంగా హెచ్చరించారు.

ఈ మీడియా సమావేశంలో గుడి పాటి లక్ష్మీనరసయ్య, ముంతాజ్ అలీ, అన్నెబోయిన సుధాకర్, నో ముల జనార్ధన్, రవీందర్ రెడ్డి, ధ నుంజయ, సైదులు, మేకల సాగర్ రెడ్డి, జి ల్లా వెంకటేశం, జస్వంత్, చిలుకరాజు సతీష్, జేరిపోతుల ర మేష్ గౌడ్ వెంకట నరసయ్య, కర్నాటి యాదగిరి,గాజుల శ్రీని వాస్, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.