PccNalgondaCongress : పార్టీవిధేయుడైన సమన్వయకర్తకే జిల్లాకాంగ్రెస్ అధ్యక్షునిగా అవకాశం
--పారదర్శకంగా,ప్రజాస్వామ్య యు తంగా డిసిసి అధ్యక్షుడి ఎంపిక --ఏఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతి
PccNalgondaCongress : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని ఎంపిక పారదర్శకంగా, ప్రజాస్వామ్య యుతంగానిర్వహించడం జరుగు తుందని ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ విశ్వరంజన్ మహంతి అ న్నారు.డిసిసి అధ్యక్షుడు ఎంపిక కు సంబంధించి శనివారo నల్లగొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి క్యాంప్ కార్యాలయంలో అబ్జర్వర్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ లతో కలిసి పార్టీ శ్రే ణులతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రజాస్వామ్య యుతంగా,పార్టీ నా యకులు, కార్యకర్త మనోభావాల ను, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుని ని యామకం చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.అందులో భా గంగానే మొట్టమొదటగా నల్గొండ నియోజ కవర్గంలో మొదటి స మావేశం నిర్వ హించామని తెలిపారు.డిసిసి అధ్యక్షుడు నియా మ కం తర్వాత బ్లాక్, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎంపిక నిర్వహిస్తామని తెలిపారు.జిల్లాలో 10 రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి డిసిసి అధ్యక్షుడు నియామకానికి సంబం ధిం చి అందరి అభిప్రాయాలను తీసుకుంటామని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ దిశానిర్దేశంతో పారదర్శకంగా డిసిసి అధ్యక్షుని ఎం పిక చేయడం స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఆలోచన అనుగునంగా పార్టీకి అంకితభావంతో పనిచేసే వారిని, అందరినీ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించే వ్యక్తిని ఎంపిక చేయడం జరుగుతుం దని తెలిపారు.రాజకీయ సమీకరణలను, అ భిప్రాయాలను పరిగ ణలోకి తీసుకొని దరఖాస్తులను ఏఐసిసికి అందజేయడం జరుగు తుందని పేర్కొన్నా రు.
ఎఐసిసి సెక్రటరీ, జిల్లా అబ్జర్వర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య యు తంగా, పారదర్శకంగా డిసిసి అధ్యక్షు లను ఎంపిక చేస్తుందని అ న్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కా ర్యక్రమంలో తెలంగాణ రా ష్ట్రంలోని 33 జిల్లాలలో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సమావేశాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు.పార్టీలో ఎవరైనా డి సిసి అధ్యక్షుని కోసం దరఖాస్తు చే సుకోవచ్చన్నారు.డిసిసి అభ్యర్థి ఎంపికకు సం బంధించి పార్టీ శ్రేణులు వ్యక్తిగతంగా కానీ,సమిష్టిగా కానీ తమ అభి ప్రాయాలను వెల్లడించవ చ్చని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ఎస్ పార్టీ ఇంట్లో కూర్చుని అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఎద్దేవా చేశారు.బిజెపిలో అమిత్ షా కనుసై గలతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంద న్నారు.కాంగ్రెస్ పార్టీలో మాత్రం పా రదర్శకంగా డిసిసి నియామకం జ రుగుతుందని పేర్కొ న్నారు.ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ దిశా, నిర్దేశ ప్రకారం ప్రజా స్వామ్య యుతంగా, పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేర కు డిసిసి అధ్యక్షుని ఎన్నిక చేయ డం జరుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్ట పడిన వ్యక్తికి, అందరినీ సమన్వ యపరిచే వ్యక్తికి, అందరి అ భిప్రాయాలను తీసుకొని డిసిసి అధ్యక్షు డిని ఎంపిక చేయడం జ రుగుతుందని తెలిపారు.పార్టీలో కష్టపడి పని చేసిన వ్యక్తికి తప్ప కుండా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కాంగ్రె స్ పార్టీ అధ్యక్ష పదవిని నల్గొండ పట్టణ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డికి ఇవ్వాలని నియో జ కవర్గ పార్టీ కార్యకర్తలంతా ఏకగ్రీవంగా విశ్వరంజన్ మహంతి, సం పత్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
ఇదిలా ఉండగా గుమ్ముల మోహన్ రెడ్డికి డిసిసి పదవి ఇవ్వాలని కోరు తూ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, పలువురు పార్టీ నాయ కుల త ర ఫున మాజీ మున్సిపల్ చైర్మన్ బు ర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ లు వారికి దరఖాస్తులు అందజేశారు. వీరితోపాటు డి సిసి అధ్యక్ష పదవి కోసం పలువురు దరఖాస్తులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సేవాదళ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కాల్వ సుజాత, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మా జీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి, నల్లగొండ మాజీ జడ్పి టిసిలు పాశం రామ్ రెడ్డి,వంగూరి లక్ష్మయ్య, టిపిసిసి నాయకులు ఇం తియాజ్ హుస్సేన్,కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అ నూప్ రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పున్నకైలాస నే త, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ హఫీజ్ ఖాన్, దైద రవీందర్, డీ సీఎంఎస్ మాజీ చైర్మన్ బొల్ల వెంక ట్ రెడ్డి, దైద రవీందర్,
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోప గా ని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, యూత్ కాంగ్రెస్ ని యోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగ రాజుతో పాటు మాజీ కౌన్సిలర్లు ని యోజకవర్గంలోని వివిధ మండలా ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ జడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసి లు, యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.