Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌ రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తు లుగా నియమించ డానికి సుప్రీంకో ర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌ రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తు లుగా నియమించ డానికి సుప్రీంకో ర్టు కొలీజి యం సిఫార్సు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలి పింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియ జేశారని పేర్కొంది.

సుప్రీంకోర్టు(supreme court) ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వం లోని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయ మూర్తు లుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌ రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నారని నిర్ణ యించినట్టు వెల్లడించింది. తెలం గాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూ ర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తు లతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరించింది.

Permanent Judges of Telangana High Court