Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandana deepthi: సభలు సమావేశాలకు అనుమతి తప్పనిసరి

వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టబద్రుల ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్పీ చందనా దీప్తి

ప్రజా దీవెన నల్గొండ: వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టబద్రుల ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎస్పి చందనా దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల పరిధి దాటకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలకు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని, వారి ప్రసంగాలలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని అన్నారు.

అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాలలో ప్రచారం వంటివి చేయకూడదని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ఇండ్ల గోడలపై రాతలు రాయటం, హోర్డింగులు ఏర్పాటు చేయడం వంటివి చేయవద్దని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచే విధంగా పోస్ట్ లు పెట్టరాదని,ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు చేయవలసి వస్తే సి- విజిల్ అప్ ద్వారా పిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Permission is mandatory for meetings