Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 3:43 am Posted by : praja deveena

Petol deisle prices onceagain hiked : బిగ్ బ్రేకింగ్, వాహనదారులకు ‘షాక్ సర్క్యూట్’, మళ్లీ పెరిగిన ఇంధన మంటలు

Petol deisle prices onceagain hiked :  ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: రెండ్రోజుల ముచ్చట తీరకముందే కేంద్రం గట్టి ఝలక్ ఇచ్చింది. మీరు విన్నది ని జమే బాస్ బంకుకెళ్లి “ఫు ల్ ట్యాంక్” అని ధీమాగా చెప్పే రోజులు మళ్లీ పోయాయి. నాలుగు రోజులు కూడా తిరక్కుండానే కేంద్ర ప్రభుత్వం వా హనదారుల జేబులకు రెండోసారి చిల్లు పెట్టింది.తాజా రేట్ల ‘పెంపు’ లెక్కల ప్రకారం పెట్రోల్  లీటరుకు 86 పైసలు, డీజిల్ లీట రు కు 83 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసు కుంది.

ఈ స్పీడు చూస్తుంటే భవిష్యత్తులో పెట్రోల్ బంకుల దగ్గర సె క్యూరిటీ గార్డులు కాదు, ఏకంగా బౌన్సర్లు పెట్టుకోవా ల్సి వ చ్చేలా ఉంది.జీతాలు పెరిగే వేగం కంటే, ఇంధన ధరలు రా కెట్‌లా దూసుకుపోయే వేగమే ఎక్కువగా ఉంది. బండి తీ యాలంటేనే ‘కలగనే’ రోజులు దగ్గర్లోనే ఉన్నాయేమో అనిపి స్తుంది.

   నాలుగు రోజుల్లో రెండోసారి

కేంద్రం నుంచి వాహనదారులకు ఊహించని ‘డబుల్ ధమా కా’ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. లీటర్ ఇం ధనం ధరలు మ ళ్లీ పైపైకి కదిలా యి. మొన్నటి దెబ్బ నుంచి కోలుకో కముం దే, ఈరోజు పడిన రెండో షాక్‌తో సామాన్యుడు బండిని రో డ్డు పైకి తీయాలా లేక ఇంట్లోనే షోపీస్‌ లా పెట్టుకోవాలా అ ని ఆలోచిస్తున్నాడు. ఈ లెక్కన ఫ్యూచర్‌లో  పె ట్రోల్ కొట్టిం చడం అంటే లగ్జరీ కార్లు కొనడంతో సమానమే అన్న చర్చ జోరుగా కొనసాగుతోంది.