Rural players: గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను వెలికి తీయాలి
మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు పంది కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహారావు మాతంగి భాయ్ అమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మాతంగి సురేష్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మాతంగి సైదులు శుక్రవారం సందర్శించినారు.
*క్రీడలు మానసిక ఉల్లాసానికి ద్రోహదపడతాయి
*క్రీడాకారులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి
ప్రజా దీవెన,:కోదాడ: మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు పంది కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహారావు(Nama Narasimha Rao)మాతంగి భాయ్ అమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ మాతంగి సురేష్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మాతంగి సైదులు శుక్రవారం సందర్శించినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు వ్యాయామంతో మంచి లక్షణాల అలవర్చుకోవాలని క్రీడల ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు.చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి అలవాట్లు అలవర్చుకోవాలని పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో సరైన క్రీడల వసతి లేక ఎంతోమంది క్రీడాకారులు(Sportsmen)మరుగున పడిపోతున్నారని వారిని వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే గ్రామాలలో చాలావరకు క్రీడలు అంతరించిపోయాయని ఈ క్రీడలు లేకపోవడం వలన పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నారని గుర్తు చేశారు. వేసవిలో కూడా క్రీడాకారుల కోసం సమయాన్ని వెచ్చించి క్రీడాకారులను తీర్చిదిద్దడానికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజులలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో వాలీబాల్ కోచ్ పంది కళ్యాణ్(Kalyan) కీలక పాత్ర పోషించాలని అన్నారు.క్రీడాకారులు ఇలాంటి శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడలలో చదువులలో రాణించి విద్యార్థి దశలోనే శారీరకదారుఢ్యం పెంపొందించుకోవాలని అన్నారు.
రాబోయే రోజులలో మంచి ఉద్యోగాలు సాధించేందుకు క్రీడల కోటాలో రిజర్వేషన్(Reservation in sports quota)పొందేందుకు క్రీడల సర్టిఫికెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తు చేశారు.క్రీడాకారులకు ఆటల యొక్క మెలకువలు వారికి వివరించారు. క్రీడాకారులకు పౌష్టిక ఆహారాన్ని అందించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నామా నరసింహారావుని,ఎంబిఎం బ్లడ్ గ్రూప్ ట్రస్ట్ చైర్మన్ మాతంగి సురేష్(Matangi Suresh)లను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలోక్రీడాకారులుమురళిసన్నీ,యాకోబు,తరుణ్,వంశీ,రవిబాబు,దిలీప్,సత్యం,కార్తీక్,రవితేజ,చైతన్య,కమలహాసన్,నాగచైతన్య,నాగ పృద్వి,సందేశ్,కోచ్ పంది కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Players found in villages