Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi Parlament elections : కొనసాగుతోన్న మూడోవిడత పోలింగ్

--అహ్మదాబాద్ లో మోదీ ఓటు హక్కు వినియోగం --ఈ దఫా ఓటింగ్ శాతం రికార్డులు సృష్టించాలన్న ప్రధాని --దేశంలో 11రాష్ట్రాల్లో 93 ఎంపీ సీట్లకు ప్రశాంతంగా పోలింగ్

కొనసాగుతోన్న మూడోవిడత పోలింగ్

–అహ్మదాబాద్ లో మోదీ ఓటు హక్కు వినియోగం
–ఈ దఫా ఓటింగ్ శాతం రికార్డులు సృష్టించాలన్న ప్రధాని
–దేశంలో 11రాష్ట్రాల్లో 93 ఎంపీ సీట్లకు ప్రశాంతంగా పోలింగ్

ప్రజాదీవెన, ఢిల్లీ: లోక్ సభ ఎన్నిక ల్లో భాగంగా దేశంలో మూడో వి డత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 93ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభంకాగా ప్రధాని మోదీ ( pm modi) తన ఓటు హక్కును అహ్మదాబాద్ లో వినియోగించు కున్నారు.

గుజరాత్, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్‌లో 7 ఏడు స్థానాలు సహా పశ్చిమ బెంగా ల్, బీహార్, అసోం, గోవాలో పోలింగ్‌కు ఎన్నికల సంఘం ( electio n commission ) కమీషన్ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది.

అహ్మదా బాద్ లో ఓటు హక్కు వినియోగించుకు న్న అనంతరం ప్ర జలకు అభివాదం చేసిన తర్వాత ఒక వృద్ధ మహిళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కట్టింది. ప్రధాని చేతులు జోడించి ఆమె ఆశీస్సు లు కోరారు. ప్రధాని మోదీ ఓటు వేసిన తర్వాత రోడ్డుకు ఇరువైపులా ఉన్న జనాల వైపు చూస్తూ అభివాదం చేశారు.

ఈ ఉదయం ఓటు వేయడానికి ప్రధాని మోదీ సోమవారం అర్థరాత్రి గుజరాత్ చేరుకున్నారు. ఆయనతో పాటు అమిత్‌ షా ( amith Sha ) పోలింగ్ బూత్ వద్ద ఉన్నారు. అతను తన సంప్రదాయ కు ర్తా పైజామా, కుంకుమ పువ్వు రంగు హాఫ్ జాకెట్ ధరించారు.

పోలింగ్‌ బూత్‌ నుంచి బయ టకు వెళ్లిన ఆయన తన వేలిపై చెర గని సిరా గుర్తును చూపించి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని కోరారు.రికార్డు స్థాయి లో ఓ టు వేయాలి అంతకుముందు రోజు రికార్డు స్థాయిలో ఓటు వేయా లని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.

మోదీ తన X ఖాతాలో వివిధ భాషలలో పోస్ట్ చేశారు.నేటి దశలో ఓటు వేసే వారందరినీ రికార్డు సం ఖ్యలో ఓటు వేయమని కోరారు. ఉత్సాహం చేస్తుంటే రికార్డ్‌ స్థాయి లో పోలింగ్‌ శాతం నమోదయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

93 లోక్‌సభ స్థానా లకు మూడో దశ సార్వత్రిక ఎన్ని కల పోలింగ్ మంగళవారం ఉద యం 7:00 గంటలకు ప్రారంభమైంది. ఈ దశలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లు అస్సాం (4), బీహార్ (5), ఛత్తీస్‌ గఢ్ (7), దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూ (2), గోవా (2), గుజరాత్ (25) ), కర్ణాటక (14), మహారాష్ట్ర (11), మధ్యప్రదేశ్ (8), ఉత్తరప్రదేశ్ (10), పశ్చిమ బెంగాల్ (4). సూరత్ స్థానాన్ని బీజేపీ అనూహ్యంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దశలో 1.85 లక్షల పోలింగ్ స్టేషన్లలో మొత్తం 17.24 కోట్ల మం ది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 23 దే శాల నుండి 75 మంది ప్రతినిధులు పోల్ ప్రక్రియను చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరు గుతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

నరేంద్ర మోడీ నేతృ త్వంలోని బిజెపి మూడవసారి అధి కారం కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష ఇండియా కూటమి అధికా రాన్ని చేజి క్కించుకోవాలని లక్ష్యం గా పెట్టుకుంది.