Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Modi wins: ముచ్చటగా మూడోసారి మోడీ

దేశ చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి గానరేంద్ర మోడీ పగ్గాలుచేపట్టబోతున్నారనిభారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ యాదవ్ అన్నారు.

గణనీయంగా తెలంగాణలో పుంజుకున్న బిజెపి
2028లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కాయం:డా,, అంజి యాదవ్

 

ప్రజా దీవెన, కోదాడ: దేశ చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి గానరేంద్ర మోడీ పగ్గాలుచేపట్టబోతున్నారనిభారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డా,, మల్లెబోయిన అంజి యాదవ్ యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోనే అంజి యాదవ్ నివాస గృహములొ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజి యాదవ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి చూసుకుంటే నెహ్రూ రికార్డును బద్దలు కొట్టి మూడోసారి ప్రధాని అవుతున్నఘనత నరేంద్ర మోడీది అని అన్నారు.

గణనీయంగా తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పుంజుకుందని అధికార పార్టీకి థిటుగా ఎంపీ స్థానాలు సాధించడంలో బిజెపి విజయం సాధించిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు,ఇప్పుడు పాలిస్తున్న పాలకుల మాయ మాటలు ఇక నమ్మే పరిస్థితి లేక బిజెపికి మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాబోయే 2028 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.దేశంలో మూడోసారి బిజెపికి ఇంత గణనీయమైన మార్పు రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ప్రజలు మూడోసారి పట్టం కట్టారని అన్నారు.

కోదాడ నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోల్చుకుంటే గణనీయంగా బిజెపి ఓటు బ్యాంకు గ్రామస్థాయి నుండి పెరిగిందని గుర్తు చేశారు.అనంతరం ప్రభుత్వ హాస్పటల్ నుండి రంగా థియేటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి రంగా థియేటర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాణాల సాయి శర్మ,బుర్ర నవీన్,రౌత్ కళ్యాణ్,బి లచ్చు నాయక్,చింతకుంట్ల   సతీష్, నాగేశ్వరరావు, రఘు, సతీష్, రాజశేఖర్, వెంకన్న, నవీన్, లింగయ్య, యాకోబు  తదితరులు  పాల్గొన్నారు.

PM Modi won in Parliament elections