Police department cyberabad : పోలీసు శాఖకు వన్నెతేవాలి
--సైబరాబాద్ లో SCTPCs బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభం --శిక్షణలో SCTPC లు సంస్థాగత విలువలను పాటించాలి --వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి --సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి
తెలంగాణ పోలీసు శాఖకు వన్నె తేవాలి
–సైబరాబాద్ లో SCTPCs బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రారంభం
–శిక్షణలో SCTPC లు సంస్థాగత విలువలను పాటించాలి
–వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
–సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి
ప్రజా దీవెన, హైదరాబాద్: సివిల్ SCTPCsలు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్ లో బుధవారం సివిల్ SCTPCs స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ ( Stipendiary Cadet Trainee Police Constables)ల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి విచ్చేసి ప్రసంగించారు.
2024వ బ్యాచ్ కు చెందిన సిద్దిపేట, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం 4 యూనిట్ లకు చెందిన 196 మంది సివిల్ SCTPCs ఈ నెల 21వ తేదీన సైబరాబాద్ లోని కమాండ్ ట్రైనింగ్ సెంటర్ లో రిపోర్ట్ చేశారు. వీరిలో సిద్దిపేట యూనిట్ కు చెందిన 59 మంది, మెదక్ యూనిట్ కు చెందిన 56 మంది, ఖమ్మం యూనిట్ కు చెందిన 54 మంది, భద్రాద్రి కొత్తగూడెం యూనిట్ కు చెందిన 27 మంది ఉన్నారు.
వీరందరికీ సైబరాబాద్ సీటీసీ లో 9 నెలల ట్రైనింగ్ ఉంటుంది.ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ SCTPCs స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. పోలీస్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పోలీస్ ఉద్యోగ ఉత్తీర్ణత సాధించడం కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అహోరాత్రులు కష్టపడి చదివి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తారన్నారు.
అందులో కొందరికే ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందన్నారు. తెలంగాణ పోలీసులకు బెస్ట్ పోలీస్ గా దేశం లోనే సముచిత స్థానం ఉందన్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్న SCTPC లు ఖ్యాతిని ఉన్నతంగా నిలబెట్టాలన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ట్రైనింగ్ సమయం చక్కని అవకాశం అన్నారు. స్వీయ క్రమశిక్షణను పాటించాలి. నూతనంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు శాఖ కు మంచి పేరు తీసుకురా వాలన్నారు.
పోలీస్ వృత్తి ఉన్నతమైనద న్నారు. నిరంతరం ప్రజలకు సేవ చేయ డమే లక్ష్యంగా పని చేయాల న్నారు. ట్రైనింగ్ సమయంలో ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవు ట్ డోర్ ట్రైనింగ్ లో భాగంగా యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్, డ్రిల్, ట్యాక్టికల్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, జీపీఎస్, వెపన్ ట్రైనింగ్ తదిత ర యాక్టివిటీస్ ఉంటాయన్నారు.
ఇండోర్ ట్రైనింగ్ లో భాగంగా చట్టా లపై అవగాహన, లా అండ్ ఆర్డ ర్, సెక్యూరిటీ, పిటిషన్లు రాయడం, క్రైమ్ నంబర్లు, సెక్షన్ లు, పోలీ స్ అడ్మినిస్ట్రేషన్, జెండర్ సెన్సిటై జేషన్, వ్యక్తిత్వ వికాసం, కంప్యూ టర్ ట్రైనింగ్ తదితర అంశాలపై తర్ఫీదునిస్తారన్నారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసి యూనిట్ కు మంచి పేరు తీసుకురా వాలన్నారు. సమర్థత, వృత్తి నైపుణ్యం, నీతి నిజాయితీ తో విధులు నిర్వర్తించాలన్నారు.
అనంతరం సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డేవీస్ ఐపీ ఎస్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాన్ని సాధించిన అభ్యర్ధులంద రిని అభినందించారు. ఈ 9 నెలల ట్రైనింగ్ పైనే మిగతా సర్వీస్ మొత్తం ఆధారపడి ఉంటుంద న్నారు. ట్రైనింగ్ రూల్స్ అండ్ రేగులేషన్స్ అన్నీ పాటించాల న్నారు. సోషల్ మీడియా పట్ల జాగ్ర త వహించాల న్నారు. కానిస్టేబుళ్లు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పని చేస్తార ని, పోలీస్ డెపార్ట్ మెంట్ లో వారి పాత్ర కీలకమన్నారు.
సీటీసీ లో ఇప్పటివరకు వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులకు ట్రైనిం గ్ ఇచ్చారన్నారు. ట్రైనింగ్ లో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయ త్నం చేయాలన్నారు. ట్రైనింగ్ లో ఏవైనా ఇబ్బందులు ఉంటే ట్రైనీ అభ్యర్ధుల కోసం గ్రీవీయెన్స్ కూడా ఏర్పాటు చేశామన్నారు. అనం తరం డీసీపీ సిటిసి ప్రిన్సిపల్ LC నాయక్ మాట్లాడుతూ 2008 లో సైబరాబాద్ లో సిటిసి ని ఏర్పాటు చేశారన్నారు.
నాటి నుంచి విజయవంతంగా 5 బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ లు పూర్తి చేశామన్నారు. ట్రైనీ కానిస్టేబుళ్లు విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసి సైబరాబాద్ సీటీసీ కి మంచి పేరు తీసుకురావాలన్నారు. ట్రైనింగ్ లో సమయాన్ని వృథా చేయకుండా వివిధ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
అనంతరం సీటీసీ ఏడీసీపీ వైస్ ప్రిన్సిపల్ రామచంద్రుడు మాట్లాడు తూ ట్రైనింగ్ ని క్రమశిక్షణ తో పూర్తి చేసి తెలంగాణ పోలీస్ వ్యవ స్థకు వన్నె తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవి నాష్ మహంతి, సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డేవీస్, సిటిసి డీసీపీ ప్రిన్సిపల్ ఎల్ సి నాయక్, సిటిసి వైస్ ప్రిన్సిపల్ ఏడీసీపీ రామచంద్రుడు, ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ షమీర్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ ఇంద్రవర్ధన్, సిటిసి ఏసీపీ గంగరాం, సిటిసి ఇన్ స్పెక్టర్లు భాస్కర్, బాలరాజు, ఆర్ఐ లు, ఎస్‌ఐలు, సీటీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.