Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Police investigation : విచారణ మరింత వేగవంతం

--త్వరితగతిన పెండింగ్ కేసులన్నింటిని క్లియర్ చేయాలి --ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి --రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి --ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలoదించేందుకు కృషి చేయాలి --నెలవారి నేర సమీక్షా సమావేశంలో నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి

విచారణ మరింత వేగవంతం

 

–త్వరితగతిన పెండింగ్ కేసులన్నింటిని క్లియర్ చేయాలి
–ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి
–రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
–ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలoదించేందుకు కృషి చేయాలి
–నెలవారి నేర సమీక్షా సమావేశంలో నల్లగొండ ఎస్పీ చందనా దీప్తి

ప్రజా దీవెన/ నల్లగొండ: పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సాధ్యమైనంత త్వరితగతిన పెండింగ్ కేసులను పరిష్కరిస్తూ వాటి సంఖ్య తగ్గించేందుకు ప్రణాళిక బద్ధం గా పనిచేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నా రు. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు అధికా రులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో ఆమె మా ట్లాడారు.

పెండింగ్ లో  ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసు లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పూర్తి పారదర్శకంగా చేయాలని సూచిం చారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూ లంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసు ల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు.

ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మే నేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తుల ను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాల ని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కే సులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్య లు తీసుకోవాల ని,పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నా రు.

కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసుల ను ఎప్పటిక ప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశ గా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ రిసెప్షన్, క్రైమ్ వర్టిక ల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజ లకు అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందజే స్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు.

కమ్ముని టీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవిలు ప్రాముఖ్యత అవగాహ న కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. అదే విధంగా మ హిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యే యంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు.

విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మ రం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనా లు జరగకుండా పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అనుసరించాల ని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను స్వీకరిం చి జవాబుదారీగా ఉండాలని తెలియజేశారు.

అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం,పి.డి.యస్ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకోవ డం జరుగుతున్నదని తెలిపారు. రిపీటెడ్ గా ఇలాంటి నేరాలకు పా ల్పడే వారిపై పిడి యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు. జి ల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు.

నేషనల్ స్టేట్ హైవే లో ఉన్న అన్ని బ్లాక్ స్పాట్లను పరిశీలిం చి ప్రమాదాల గల కారణాలను తెలుకొని వాటి నియంత్రణకు కావల సిన ఇతర సంబంధిత అధికారులు ట్రాన్స్పోర్ట్,ఆర్టీసి,హైవే అథారిటీ ,గ్రామ పచాయతీ అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని అ న్నారు. ప్రతి గ్రామాలలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రోడ్డు భద్రతా నియమావళి పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. ఓవర్ స్పీడ్,ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో యస్. బి డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, డీఎస్పీ విఠల్ రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, డి.సి.ఆర్.బి డిఎస్పీ సైదా, సి.ఐ లు, యస్.ఐ లు పాల్గొన్నారు.