Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Police officers are ready for the election: ఎన్నికలకు పోలీస్ అధికారులు సంసిద్దం

--ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం విధులు --సెక్టోరియల్ పోలీస్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి --నల్లగొండ జిల్లా యస్.పి కె.అపూర్వ రావు

ఎన్నికలకు పోలీస్ అధికారులు సంసిద్దం

–ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం విధులు
–సెక్టోరియల్ పోలీస్ అధికారులకు పూర్తి అవగాహన ఉండాలి
–నల్లగొండ జిల్లా యస్.పి కె.అపూర్వ రావు

ప్రజా దీవెన/నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం పోలీస్ అధికారులకు తమ పరిధిలో ఉన్న పోలీస్ కేంద్రాల పై అవగాహనతో (As per the Election Commission guidelines, the police officers should be aware of the police stations under their jurisdiction)  పాటు సకల ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని నల్లగొండ జిల్లా యస్.పి కె.అపూర్వ రావు సూచించారు. ఎన్నికల నియమావళిని తుచా తప్పకుండా పాటించి ఇన్సిడెంట్ ఫ్రీ గా ఎన్నికలు జరిపేందుకు కృషి చేయాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు.

శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని (All Police shall work under the control, supervision and discipline of the Election Commission) సూచించారు. ఎన్నికల కమిషనర్ అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు తమ విధులు నిర్వర్తించాలని తెలిపారు.

ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, ఎలక్షన్స్ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని (Police officers should be vigilant during elections)  సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడటం తో పాటు సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని (Those who create problems should be bound over)  తెలిపారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు.

చెక్ పోస్టు లు, ఇతర ప్రదేశాలలో తనిఖీలలో విడియో కవరేజ్ చేయటం, క్యాష్ , లిక్కర్ ,ఇతర వస్తువులు పట్టుబడినప్పుడు ఎన్నికల కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం సంభందిత అధికారులు అనుసరించాల్సిన విధివిధానాల పై తగు సూచనలు చేశారు.

SST టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్ విధులలో ఉండే అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను అధికారులకు తెలియజేశారు. పోలింగ్ రోజు, ముందు రోజు పోలింగ్ కేంద్రాల దగ్గరా పాటించాల్సిన నియమాలను తెలియజేశారు. ఎన్నికల కోడ్ సమయంలో ర్యాలీలు, మీటింగ్ లకు ఎన్నీకల నిబంధనలకు లోబడి అనుమతులు (Permits for rallies and meetings during Election Code subject to election rules) ఇచ్చుట పై పలు సూచనలు చేశారు.

పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు. జిల్లా ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం బందోబస్తు తయారు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో యస్.బి డిఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్లగొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, చౌటుప్పల్ డిఎస్పీ మోగిలయ్య, డి.సి.ఆర్.బి డిఎస్పీ సైదా నాయక్, సిఐలు, ఎస్సై లు మరియు సెక్టరియల్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.