Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Police youth : మత్తుకు చిత్తవుతున్న యువత

--మెడికల్ షాప్ యజమానితో సహ ఇద్దరు యువకుల అరెస్ట్ --నిందితుల నుంచి స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ 4032, అల్ట్రా కింగ్ టాబ్లెట్స్ 585, ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు 300 స్వాధీనం --మీడియా సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడి

  1. మత్తుకు చిత్తవుతున్న యువత

–మెడికల్ షాప్ యజమానితో సహ ఇద్దరు యువకుల అరెస్ట్
–నిందితుల నుంచి స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ 4032, అల్ట్రా కింగ్ టాబ్లెట్స్ 585, ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు 300 స్వాధీనం
–మీడియా సమావేశంలో నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి వెల్లడి

ప్రజా దీవెన/ నల్లగొండ: మత్తుకు బానిసలైన యువత ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం వినియోగించే స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్, అల్ట్రా కింగ్ టాబ్లెట్లు, ట్రామాడెక్స్ ఇంజెక్షన్ లు విక్రయిస్తున్న ఒక మెడికల్ షాపు యజమానితో పాటు గత కొంత కాలంగా వాటిని వినియోగిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ( sp chandhana Deepthi) తెలిపారు. శుక్ర వారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకం గా తీసుకున్న మాదకద్రవ్యాల (drugs ) నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మాదకద్ర వ్యాల నిర్మూలనే లక్ష్యంగా గంజాయి, మాదకద్రవ్యాల మత్తు పదార్ధాల అక్రమ రవాణా ( Drug trafficking) పై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పా టు చేసిన నిరంతర నిఘా లో బాగంగా దాడులు నిర్వహిస్తు న్నామని తెలిపా రు.

శుక్రవారం రోజు విశ్వసనీయ సమాచారం మేరకు నల్లగొండ వన్ టౌన్ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్, అల్ట్రా కింగ్ ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు కలిగివున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం వారిని విచారించగా నిందితులు మహ మ్మద్ జబీయుల్లా ( 27), మహ్మద్ సల్మాన్ (24) లు సదరు మాత్రలు, ఇంజెక్షన్ల ను మత్తు అనుభూతిని పొందడానికి గత 3 సంవత్సరాల నుండి ప్రతి రోజూ వాడుతున్నట్లు చెప్పారని తెలిపారు.

కాగా వీరు జిల్లా కేంద్రంలోని స్థానిక శివాజీ నగర్ లో గల న్యూ హెల్త్ కేర్ ఫార్మసీ యజమాని తౌడోజు నరేష్ వద్ద ఎలాంటి డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా టాబ్లెట్లు, ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారని తెలిపారు. అంతే కాకుండా సదరు టాబ్లెట్లు, ఇంజెక్షన్లను ఎవ్వరికీ అనుమానం రాకుండా ఖాళీ సిగరెట్ పెట్టెల్లో దాచి బయట వ్యక్తుల కు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు కూడా అంగీకరించినట్లు ఆమె తెలి పారు. కాగా నిందితుల వద్ద నుండి స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ టాబ్లెట్స్ 403 2, అల్ట్రా కింగ్ టాబ్లెట్స్ 585, ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు 300 స్వాదీనం చేసు కొని, నిందితులను అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల విని యోగం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అక్రమ గంజాయి రవాణా, ఇతర మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల వినియోగానికి గురి కావద్దని ఆమె కోరారు. అలాగే మాదక ద్రవ్యాలు, గంజాయి మరియు మత్తు కలిగించే ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించే లేదా వినియోగిస్తున్న వ్యక్తుల సమాచారం గురించి తెలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ కు గాని, డయల్ 100 ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ యజమానులు మత్తు కలిగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు వారి యొక్క ఆస్తు లను జప్తు చేస్తూ పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పోలీసులకు ప్రజలు సహకరించాలని అంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ గా మార్చేందుకు సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.