Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MLC elections polling: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలి

వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్, కౌంటింగ్ లకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికా రులను ఆదేశించారు.

ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:  వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉపఎన్నిక(by election Polling ) పోలింగ్, కౌంటింగ్ లకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల(MLC elections) ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికా రులను ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ,ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఎమ్మె ల్సీ ఎన్నికలకు(MLC elections) సంబంధించి ఈనెల 24 న ప్రాథమికంగా నల్గొండ, సూర్యా పేట జిల్లాల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిం చాలని, ఇదేవిధంగా అవసరమైతే అన్ని 12 జిల్లాల్లో సైతం శిక్షణ నిర్వహించేలా చూడాలని కోరారు. 24వ తేదీన పిఓ,ఏపిఓ, సూక్ష్మపరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, రెండో విడత రాండమైజేషన్ సైతం అదే రోజు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 5 వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపులో(vote counting) హాజరయ్యే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు.

బ్యాలెట్ బాక్స్ లను సంసిద్ధం చేయడం, బ్యాలెట్ పేపర్, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి సిద్దం వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని, అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స సౌకర్యాలతో పాటు, దివ్యంగ ఓటర్లకు వాహనాలు ఏర్పాటు చేయాలని, వీల్ చైర్లు పెట్టాలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఈనెల 20 నుండి 25 వరకు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులు, పోలీసులు, సూక్ష్మ పరిశీలకులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక పై ఓటర్లకు తగిన అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. పట్టబద్రుల శాసన మండల ఉప ఎన్నిక ప్రణాళిక, అభ్యర్థుల వ్యయనిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.రెవిన్యూ ఆధనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, నల్గొండ ఆర్డీవో రవి, డిఎస్పి ,జిల్లా అధికారులు, తదితరులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.

Polling arrangements completed for MLC elections