Praja Deveena
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 2:07 pm Posted by : praja deveena

poorwoman Delivery in 108 ambulance : ప్రయాణంలోనే ప్రాణోదయం,108 సిబ్బంది చొరవతో అంబులెన్స్‌లో నే పండంటిబిడ్డకు జన్మనిచ్చినవై నం

poorwoman Delivery in 108 ambulance : ప్రజా దీవె న, నకిరేకల్: నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలులో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఒక వైపు ప్రాణాలను అర చేతిలో పెట్టు కుని పురిటినొప్పులతో బాధపడుతున్న యు వతి, మరోవై పు అంబు లెన్స్ కూడా వెళ్లలేని దుర్గమమైన దారి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 10 8 సిబ్బంది చూపిన స మయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది.

సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి అమ్మనబోలు గ్రామంలోని ఇటుక బట్టీ లో పనిచేస్తున్న 19 ఏళ్ల రోషిణికి శనివారం తీవ్రమైన పురి టినొప్పులు మొదలయ్యాయి. అపాయాన్ని గుర్తించిన స్థాని కులు వెంటనే 108కి సమాచారం అందించారు. పిలుపు అందగానే శాలిగౌరారం 108 అంబులెన్స్‌లో ఈఎంటీ హే మంత్, పైలట్ సమీర్ బాబా మెరుపు వేగంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అంబులెన్స్ వెళ్లలేని ఇరుకైన దారి లో రోషిణి ఉండటంతో, పైలట్ స మీర్ బాబా వెనకడుగు వేయలేదు. స్కూప్ స్ట్రక్చ ర్‌పై ఆమెను భుజా లపై మోసుకుంటూ అంబులెన్స్ వ రకు సురక్షితంగా తరలించారు. న ల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి బ యలుదేరిన కొద్దిసేపటికే, అక్కెనపల్లి వద్దకు రాగానే రోషిణి కి నొప్పులు తారస్థాయికి చేరుకున్నాయి. సమయం మించి పోతోందని గ్రహించిన హేమంత్, ఏమాత్రం తడబడకుం డా పైలట్ సమీర్ బాబాతో కలిసి అంబులెన్స్‌లోనే నార్మల్ డెలి వరీ చేసేందుకు సిద్ధమయ్యారు.

   ఆనందంతో నిండిన అంబులెన్స్

వారి ప్రయత్నం ఫలించింది. అంబు లెన్స్‌లోనే రోషిణి పం డంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టినబిడ్డ ఏడుపు ఆవా హనంలోని టెన్షన్‌ను ఒక్కసారిగా ఆనందంగా మార్చేసిం ది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకున్నాక, ఇద్దరినీ నల్గొం డలోని మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించారు. క్లిష్ట స మయంలో అంబులెన్స్‌ను ఒక ప్రసూతి గదిలా మార్చి, తల్లీ బిడ్డల ప్రాణాలను కా పాడిన 108 సిబ్బంది హేమంత్ మరి యు సమీర్ బాబాల సమయ స్ఫూర్తిపై స్థానికులు, అధికా రులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మాకు ఆ సమయంలో వేరే ఆలోచన లేదు, తల్లీబిడ్డ క్షేమం గా బయటపడటమే మాకు పెద్ద విజయం అని వారు నిరా డంబరంగా చెప్పడం వారి బాధ్యతాయుతమైన మనసును చాటిచెబుతోంది.