Communist leader:పోతురాజు రామయ్య మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు
పోతురాజు రామయ్య మృతి అల్వాల పురం కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖకు తీరని లోటు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ కోదాడ మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు.
ప్రజా దీవెన, కోదాడ: పోతురాజు రామయ్య(Pothuraj Ramaiah)మృతి అల్వాల పురం కమ్యూనిస్టు పార్టీ గ్రామ శాఖకు తీరని లోటు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్ కోదాడ(Kodada) మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు పోతురాజు రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తన నివాస గృహములో మృతి చెందారు ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు మృతుని నివాసానికి వెళ్లి పార్థివదేహంపై కమ్యూనిస్టు పార్టీ(Communist Party)జెండా కప్పి పూలమాలలతో నివాళులర్పించారు.
అనంతరం సిపిఐ(CPI) నాయకులు మాట్లాడుతూ పోతురాజు రామయ్య మృత అల్వాల్ పురం గ్రామ శాఖకు కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని తెలిపారు పురం లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారని వారు పేర్కొన్నారు నివాళులు అర్పించిన వారిలో మేకల శ్రీనివాసరావు బత్తినేని హనుమంతరావు కమ్యూనిస్టు పార్టీ ప్రసాద్ బొల్లు ప్రసాదు పోతురాజు సత్యనారాయణ మాతంగి గాంధీ కొండ కోటేశ్వరరావు నిడిగొండ కనకయ్య బత్తినేని శ్రీనివాసరావు కమతం వెంకటయ్య కంబాల స్వామి పోతురాజు రాజేశ్వరరావు.
poturaju ramaiah passed away