Padma awards: పద్మ అవార్డుల ప్రధానం
దేశ రాజ ధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మశ్రీ పురస్కరాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
132 మందికి పద్మ అవార్డులు అందజేత
పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు, చిరంజీవి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మశ్రీ(Padma sri) పురస్కరాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అవార్డు గ్రహీతులకు పురస్కరాలు అందజేశారు. కళారం గంలో బంగ్లాదేశ్ గాయని రెజ్వానా చౌదరి బన్యాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీని ప్రదానం చేశారు. భజన-గాయకుడు కాలూరామ్ బమానియాకు పద్మశ్రీని అందజేశా రు. ఇక వైద్యరంగంలో తేజస్ మధు సూదన్ పటేలు పద్మభూషణ్(Padma bhushan), వాణి జ్యం, పరిశ్రమల రంగంలో సీతారాం జిందాల్ కు, పద్మభూషణ్ కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశా రు.ఈ కార్యక్రమంలో పద్మ విభూ షణ్ పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకున్నారు.
ఈ లిస్ట్ లో మన తెలుగు వారు నారాయణపేటకు చెందిన బుర్ర వీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, జనగాంలోని చిం దు యక్షగానం రంగస్థల కళాకారు డు గడ్డం సమ్మయ్య లకు పద శ్రీలు, అలాగే కళారంగానికి చెందిన ఎ. వేలు ఆనందాచారి కూడా వారే. సాహిత్యం విద్యా రంగంలో కేతావ త్ సోమ్లాల్, కూరెళ్ల విట్టలాచార్య లకు కూడా ఈ అవార్డ్స్ దక్కను న్నాయి. ఏపీ నుంచి తొలి మహిళా హరికథా వ్యాఖ్యాత ఉమా మహే శ్వరి కూడా అవార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన చిరంజీవి నటనపై ఆయనకు ఉన్న అమితమైన ఆసక్తితో మద్రాసు వెళ్లారు.
అక్కడ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందిన చిరంజీవి తొలిగా పునాదిరాళ్లు సినిమాలో నటించారు. కానీ నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. సినీరంగం లో చిరంజీవి చేసిన కృషిని గుర్తించిన కేంద్రం రెండోసారి పద్మ(Padma awards) అవార్డుతో సత్కరించనుంది. 2006 లో చిరంజీవిని పద్మభూషణ్ అవా ర్డుతో సత్కరించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయాల్లో విశేష సేవలందించా రు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రా
జకీయాల్లో ఆయన చురుగ్గా ఉం డేవారు. విద్యార్థి రాజకీయాల నుం చి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన ఆయ న దేశ ప్రజలకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మ విభూషణ్ ను ప్రకటించింది. 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. 1998 నుంచి 2017 వరకూ ఎంపీగానూ సేవలందించారు.
President Draupadi Murmu give padma awards