OpinionPoliticsక్రైంతెలంగాణనల్గొండహైదరాబాద్

Principal District Judge Vasanth : బిగ్ బ్రేకింగ్,ప్రిన్సిపల్ జిల్లా జడ్జి పి. వసంత్ కీలక సూచన, కేసుల పరిష్కారంలో మరింతస్పీడ్ పెం చాలి

Principal District Judge Vasanth : ప్రజా దీవెన, నల్లగొండ: కేసుల పరిష్కారంలో జాప్యానికి చెక్ పె ట్టేందుకు న్యాయ, పోలీస్, రెవె న్యూ శాఖలు మరింత సమన్వ యం తో పనిచేయాలని నల్గొండ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి పి. వసంత్ సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించాలంటే మూ డు శాఖల మధ్య సహకారం అ త్యంత కీలకమని స్ప ష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ని ఉదయాదిత్య భవన్‌లో శనివారం కేసుల పరిష్కారంలో న్యాయ, పోలీస్, రెవె న్యూ శాఖల సమన్వయంపై జిల్లా స్థా యి కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పి. వసంత్ మా ట్లాడుతూ ఒకే నాణేనికి రెండువైపులా ఉన్నట్లుగా న్యాయ, పోలీస్ వ్యవస్థలు కేసు ల పరిష్కారంలో పరస్పర సహకారంతో పనిచేయాల్సి ఉం టుందన్నారు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్లో ఎదురయ్యే ప్రా క్టికల్ సమస్యలను పో లీసులు గుర్తించి, వాటి పరిష్కా రా నికి న్యాయవ్యవస్థతో సమన్వయం చేసుకోవాలని సూచిం చారు.

   రూపారెడ్డి హత్య కేసుపై ప్రశంసలు

ఇటీవల జరిగిన ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసును జిల్లా ఎస్పీ శ రత్ చంద్రపవార్ నేతృత్వంలోని పోలీసులు సమర్థ వంతంగా ఛేదించి, నిందితులను త్వరగా పట్టుకోవడాన్ని జిల్లా జడ్జి అభి నందించారు. కేసుల దర్యాప్తులో ఇదే తర హా వేగం, సమర్థత కొనసాగించాలని సూచించారు.

    పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రిమినల్, అండర్ ట్ర యల్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల సత్వర పరిష్కారానికి న్యా య, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందిం చేందుకు జిల్లా యం త్రాంగం తరఫున న్యాయవ్యవస్థ కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

టెక్నాలజీతో దర్యాప్తుకు మరింతబలం

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ కేసుల పరి ష్కారంలో ఆధునిక సాంకేతికత వినియోగం కీలకమన్నా రు. ఈ-సాక్ష్యం, ఖచ్చితమైన ఆధారాల సేకరణ, ఎఫ్‌ఐఆర్ వినియోగం, ఈ -సమన్లు వంటి విధానాలను మరింత సమ ర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వి విధ కేసుల్లో న్యాయస్థానాల సహకారంతో వేగంగా ముందు కు సాగేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

అదనపు జడ్జి కె. కవిత మాట్లాడుతూ సమన్వయ సమావే శాల ద్వారా కేసుల పరిష్కారంలో ఎదురయ్యే ప్రత్యక్ష సమ స్యలను గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంద న్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న నాన్-బెయి లబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇ వ్వాలని సూచించారు. పాత కే సుల పరిష్కారంలో గుర్తిం పు, ప రిశీలన, అమలు, నివేదిక, సమీక్ష విధానాలు సమర్థ వంతంగా ఉపయోగపడతాయని తెలిపారు.పెండింగ్ కేసు ల పరిష్కారాన్ని పో లీసులు సీరియస్‌గా తీసుకుని న్యాయ వ్యవస్థకు అవసరమైన సహకారం అందించాలని ఆమె కో రారు.ఈ సమావేశంలో పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button