
Problems raised Rice Millers in Nalgonda : ప్రజా దీ వెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్ల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ధా న్యం కేటాయింపులు, కస్ట మ్ మిల్లింగ్ రైస్ (CMR), బాయిల్డ్–రారైస్ విధానం, మిల్లిం గ్ చార్జీ లు, ఖాళీ బస్తాల నిర్వహణ తదితర అంశాలపై న ల్లగొండ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ పలు కీలక డిమాం డ్లను ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లింది.ఈ రాష్ట్రానికి రైతు ఒ క కన్ను రైస్ మిల్లర్ మరో కన్ను అని పేర్కొన్న మిల్లర్లు.. రైతు ల ప్ర యోజనాలతో పాటు మిల్లింగ్ ప రిశ్రమ ఎదుర్కొంటు న్న సమస్య లను కూడా ప్రభుత్వం పరిగణన లోకి తీసుకో వాలని కోరారు.
బకాయిలున్న మిల్లులపై చర్యలకు సహకారం
ప్రభుత్వానికి బకాయిలు ఉన్న మిల్లులను తనిఖీ చేసి, బ కాయిలు వసూలు చేయడంలో తమకు ఎలాంటి అభ్యంత రం లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. అయితే బకాయి లు లేని మిల్లు లను కూడా ఇన్‌స్పెక్షన్ల పేరుతో ఇబ్బందు ల కు గురిచేయడం సరి కాదని పేర్కొంది.90 శాతం మంది మి ల్లర్లను దొంగలు, దోపిడీదా రులుగా చిత్రీకరించడం తగదని.. నిబంధనల ప్రకారం పనిచేస్తున్న మిల్లర్లను కూడా ప్రభుత్వం ప్రో త్సహించాలని కోరింది

బాయిల్డ్ రైస్ నిల్వలతో ఇబ్బందులు
ఆగస్టు 28 నుంచి బాయిల్డ్ రైస్ ను స్వీకరించకుండా CMR ప్రక్రి య నిలిచిపోయిందని మిల్లర్లు తెలిపారు. మొదట బా యిల్డ్ రైస్ ఇవ్వాలని సూచించి, ప్రస్తుతం రారైస్ మాత్రమే ఇవ్వాలని చెప్ప డం వల్ల మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇప్పటికే మిల్లుల్లో భారీ గా నిల్వ ఉండటంతో స్థలం లేకుండా పోయిందని, నిల్వలు ఎక్కువకాలం ఉంటే నాణ్యత దె బ్బతిని నష్టం వాటిల్లే ప్ర మాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విధానంలో మా ర్పులు ఉంటే కనీసం వారం రోజుల ముందుగానే సమాచా రం ఇవ్వాలని కోరారు.
మిల్లులు నెలరోజులు బంద్ అయితే భారీ భారం”
గత ఐదు రోజులుగా మిల్లులు మూతపడ్డాయని, పరిస్థితి నె ల రోజుల వరకు కొనసాగితే ఒక్కో మిల్లుపై సుమారు రూ.15–20 లక్షల వరకు నిర్వహణ భారం ప డే అవకాశం ఉందని అసోసియే షన్ పేర్కొంది.CMR ఆలస్య మై తే 25 శాతం పెనాల్టీతో పాటు 1 2 శాతం వడ్డీ విధించే నిబంధన లపై కూడా మిల్లర్లు ప్రశ్నలు లేవ నెత్తారు. రారైస్ ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ధా న్యాన్ని తిరిగి తీసుకుని తమ ఖా తాల్లో జమ చేసుకోవాలని కలె క్ట ర్‌ను కోరుతూ లేఖ ఇచ్చినట్లు తె లిపారు.
కొత్త ధాన్యం కేటాయింపుపైనా కీలక విజ్ఞప్తి
ప్రస్తుత సమస్యలు పరిష్కారమ య్యే వరకు కొత్త ధాన్యం కేటా యింపులు నిలిపివేయాలని మి ల్లర్లు కోరారు. 2026–27 వానా కాలం ధాన్యాన్ని ముందుగా ప్ర భుత్వ గిడ్డంగుల్లో భద్రపరచి, టె స్ట్ మిల్లింగ్ నిర్వహించిన తర్వా తే మిల్లులకు కేటాయించాలని సూచించారు.అలాగే రా రైస్, బా యిల్డ్ రైస్ కేటాయింపుల్లో స్పష్ట మైన నిష్పత్తి పాటించాలని కోరు తూ.. రెండు లారీలకు 67 శాతం రా రైస్, మరో రెండు లారీ లకు 6 8 శాతం బాయిల్డ్ రైస్ ఇవ్వాలని ప్రతిపాదించారు.
సార్టెక్స్, బస్తాల సమస్యలపై ఆందోళన
సార్టెక్స్(Sortex) ప్రక్రియలో భా రీగా నష్టాలు వస్తున్నాయని మిల్లర్లు తెలిపారు. ఖాళీ బస్తాల్లో పురుగులు రావడం వల్ల బియ్యం నాణ్యత దెబ్బతిని రిజెక్ట్ అవు తున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.దాదాపు పదేళ్లుగా ఖాళీ బస్తాలు మిల్లుల్లోనే ఉండి పోవడంతో 25 శాతం వరకు డ్యా మేజ్ అవుతున్నాయని, వాటి లె క్కలు ఇప్పటికీ పూర్తిగా తేల్చలే దని అసోసియేషన్ తెలిపింది.
40 ఏళ్లుగా వర్కింగ్ చార్జీలు మారలేదు
మిల్లర్లకు చెల్లిస్తున్న రూ.10, రూ.20 వర్కింగ్ చార్జీలు దాదా పు 40 ఏళ్లుగా మారలేదని అసోసియేషన్ పేర్కొంది. వర్కిం గ్, ట్రా న్స్‌పోర్ట్, డ్రేజీ, కస్టోడియన్ చార్జీ లు ఏళ్ల తరబడి పెం డింగ్‌లో ఉ న్నాయని తెలిపింది.2022–23 రబీ టెండర్ ధా న్యానికి సంబం ధించిన చార్జీలు కూడా చెల్లించలే దని, మ రోవైపు మళ్లీ మార్కెట్ ఫీ జులు చెల్లించాలని ఒత్తిడి చేయ డం సరికాదని పేర్కొంది. మిల్లర్ల మార్కెట్ లైసెన్సులను రెన్యూవ ల్ చేయకుండా ఇబ్బందులు పె ట్టొద్దని విజ్ఞప్తి చేసింది.
ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు ఇవ్వాలి
ఇతర రాష్ట్రాల్లో చెల్లిస్తున్న మి ల్లింగ్ చార్జీల తరహాలోనే తెలం గాణలో కూడా తగిన చార్జీలు చెల్లించాలని రైస్ మిల్ల ర్ అసోసి యేషన్ డిమాండ్ చేసింది. లేదం టే మిల్లింగ్ పరి శ్రమలు మరింత తీవ్ర ఆర్థిక నష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంద ని ఆందోళన వ్యక్తం చే సింది.ప్రభుత్వానికి తాము వ్యతి రే కం కాదని, రైతులు మరియు మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొం టున్న సమస్యలకు పరిష్కారం కోరేందుకే ఈ విజ్ఞప్తులు చే స్తున్నా మని అసోసియేషన్ స్పష్టం చే సింది.రైతులు బాగుం టేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు ఒక క న్ను.. రైస్ మిల్లర్ మ రో కన్ను. రై తుమిల్లర్ కలిసి నడిస్తేనే వ్య వసాయ రంగం బలపడుతుందని నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేష న్ పేర్కొంది.




