Plants: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదని కోదాడ ఎంపీడీవో అన్నారుప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కోదాడ మండల పరిధిలోని దొరకుంట నల్లబండ గూడెం గ్రామాలలో అమృత సరోవరం , బ్యాంకు బండ్లపై ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రజా దీవెన కోదాడ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదని కోదాడ ఎంపీడీవో అన్నారుప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం కోదాడ మండల పరిధిలోని దొరకుంట నల్లబండ గూడెం గ్రామాలలో అమృత సరోవరం , బ్యాంకు బండ్లపై ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం వలన మొక్కల నుండి నిలువడే వాయువుల నుండి పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా ఆదా చేసినట్లయితే ముందు తరాలకు ఉపయోగపడతాయని తెలిపారు భూమిని కాలుష్యం కాకుండా ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ ఈసీ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉపాధి కూలీలు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
protect environment of plants