Public welfare is possible only with Congress: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం
--కాంగ్రెస్ గెలుపు బిఅర్ఎస్ అవినీతి అంతానికి మలుపు --నల్లగొండ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం
–కాంగ్రెస్ గెలుపు బిఅర్ఎస్ అవినీతి అంతానికి మలుపు
–నల్లగొండ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: ప్రజా సంక్షేమ పాలన కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీముల కరపత్రాలను ( The Congress party has distributed pamphlets of six guarantee schemes for him to win with a large majority as a candidate of the Congress party) అందజేస్తూ అభ్యర్థించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడని (CM KCR is running a dictatorial rule in the state) విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నల్లగొండలో దత్తత తీసుకుంటా నని చెప్పి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శిం చారు. ఈ ఎన్ని కల్లో రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరు కుంటున్నారని గుర్తు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆరోపణలు చేసిన వారు కర్ణాటక వస్తామంటే తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించ డానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందని ( Telangana government has completely failed to fill the job vacancies) ధ్వజమెత్తారు. టిపిపిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి లీక్ కావడంతో 36 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీ స్కీములను కచ్చితంగా అమలు (6 Guarantee Schemes will be strictly implemented within 100 days of the Congress government coming to power) చేయడం జరుగుతుందని అన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సీఎం కావచ్చని, దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఈ ప్రచార కార్యక్రమంలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, స్థానిక కౌన్సిలర్ బోయినపల్లి శ్రీనివాస్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సూరెడ్డి సరస్వతి, వైస్ ఎంపీపీ జిల్లా పల్లి పరమేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమద్ ,సమీ, సాయి శ్రీ సందీప్, బుర్రి రజిత యాదయ్య, ఖయ్యూం బేగ్, ప్రదీప్ నాయక్, చిన్నాల జానయ్య, వంగాల అనిల్ రెడ్డి, కిన్నర శ్రీనివాస్, దుబ్బ అశోక్ సుందర్, ఇంతియాజ్ హుస్సేన్ ,అబ్దుల్ ఖాన్, కత్తుల కోటి, లతీఫ్, సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.