Parliament elections : ఎన్నికల్లో ఎన్డీయేకు ఎదుదెబ్బలే
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 150 సీట్లు మించి గెలవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఆయన ఘజి యాబాద్‌లో విలేకరుల సమావేశం లో పాల్గొన్నారు
150 సీట్లు మించి గెలవలేదు
మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్‌గాంధీ
ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్:(Lok Sabha elections) లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 150 సీట్లు మించి గెలవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్‌గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తొలి విడత ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఆయన ఘజి యాబాద్‌లో విలేకరుల సమావేశం లో పాల్గొన్నారు. యూపీలో తమ మధ్య బలమైన ఐక్యత ఉన్నదని వారిరువురూ సంకేతాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడు తూ 15–20 రోజుల క్రితం బీజేపీకి 180 సీట్లు వస్తాయని అంచనా వేశామని, కానీ ప్రస్తుతం ఎన్డీయేకే 150 సీట్లు దాటవని అన్ని రాష్ట్రాల నుంచి అందుతున్న నివేదికల అధా రంగా తేలిందని తెలిపారు. బీజేపీ (BJP)పట్ల ప్రజావ్యతిరేకత చాప కింద నీరులాగా విస్తరిస్తోందని, రోజు రోజుకూ ఇండియా కూటమి బల పడుతోందని ఆయన అన్నారు. యూపీలోని అమేథీ నుంచి కానీ రాయబరేలీ నుంచి కానీ మీరు పోటీ చేస్తారా అని విలేకరులు అడుగగా ఇది బీజేపీ ప్రశ్న అని రాహుల్ చమత్కరించారు. తానె క్కడి నుంచి పోటీ చేయాలన్నది పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయి స్తుందని ఆయన చెప్పారు. పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే వాటిని పాటిస్తానని తెలిపారు. దేశంలో పేదరికం ఒక్క రోజులో మటుమాయం అవుతుం దని తాము అనడం లేదని చెప్పా రు.
Rahul gandhi criticised BJP